దుర్గగుడి నూతన ఈవోగా పద్మ | AP government appoints new EO for durga temple | Sakshi
Sakshi News home page

ఏపీలో నలుగురు ఐఏఎస్‌ల బదిలీ

Jan 23 2018 6:14 PM | Updated on Sep 29 2018 5:55 PM

AP government appoints new EO for durga temple - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో నలుగురు ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. విజయవాడ దుర్గ గుడి ఆలయ నూతన ఈవోగా ఐఏఎస్‌ అధికారిణి డాక్టర్‌ ఎం.పద్మ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా పద్మ ఇప్పటికే బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2004 బ్యాచ్‌కు చెందిన ఆమె మరో రెండు రోజుల్లో ఈవోగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

అలాగే రోడ్డు భవనాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నీరబ్‌ కుమార్‌ ప్రశాద్‌, పశుసంవర్థక శాఖ, మత్స్యశాఖ కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేది, (జీఏడీ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు), ఇక సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి జేఎస్వీ ప్రసాద్‌ను ప్రభుత్వం రిజర్వ్‌లో ఉంచింది. ఆయనను జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement