బతుకమ్మ సంబరాలు | Celebrating Bathukamma | Sakshi
Sakshi News home page

బతుకమ్మ సంబరాలు

Sep 25 2017 1:07 AM | Updated on Sep 25 2017 1:07 AM

Celebrating Bathukamma

తెలంగాణ సంçస్కృతి, సాంప్రదాయాల్లో భాగంగా దేవి నవరాత్రుల సందర్భంగా తెలంగాణ ప్రజలు జరుపుకునే బతుకమ్మ సంబరాలను ఇక్కడి బెంగళూరు నగరంలో తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. కర్ణాటక తెలంగాణ కల్చరల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇక్కడి సీవీ రామన్‌ నగర్‌లో ఉన్న డీఆర్‌డీఓ కమ్యూనిటి హాల్లో పెద్ద సంఖ్యలో తెలంగాణ మహిళలు, ప్రవాసాంధ్రులు, కర్ణాటక మహిళలు సైతం ఈ బతుకమ్మ సంబరాల్లో పాల్గొని పుష్పాలతో చేసిన బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడారు.

అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి రేవతి మాట్లాడుతూ... ఏటా బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నామని, ఈ ఏడాది కూడా బతుకమ్మ పండుగలో ఉత్సాహంగా పాల్గొన్నామన్నారు.              – బొమ్మనహళ్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement