లాక్‌డౌన్‌: గుంపులుగా రథాన్ని లాగారు!

150 People Violate Lockdown For Temple Chariot Festival In Karnataka - Sakshi

బెంగుళూరు: కర్ణాటకలోని కలబుర్గిలో సిద్ధలింగేశ్వర ఆలయం రథోత్సవం సందర్భంగా భక్తులు లాక్‌డౌన్‌ నిబంధనలు తుంగలో తొక్కారు. చితాపూర్‌లో గురువారం జరిగిన రథోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన రథోత్సవంలో 100 నుంచి 150 మంది పాల్గొని రథాన్ని లాగారు. దాదాపు 20 నిముషాలపాటు రథోత్సవం సాగిందని, లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించని 20 మందికిపై కేసులు నమోదు చేశామని ఎస్పీ లడ మార్టిన్ తెలిపారు. మత సంబంధ కార్యక్రమ నిర్వహణపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ఇక ఈ ఘటనపై సీరియస్‌ అయిన పోలీసు యంత్రాంగం స్థానిక ఇన్స్‌పెక్టర్‌ను సస్పెండ్‌ చేసింది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ఒక్కరోజే 36 కేసులు నమోదవడంతో మొత్తం కేసులు 315 చేరాయి. 13 మంది మృతి చెందారు. 82 మంది కోలుకున్నారు.

Read latest Karnataka News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top