రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి | young man died in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

Apr 15 2018 11:45 AM | Updated on Aug 30 2018 4:20 PM

young man died in road accident - Sakshi

యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): ఇంటికి పెద్ద దిక్కనకున్న ఒక్కగానొక్క కొడుకు శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందడంలో కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. చేతికొచ్చిన కొడుకు తమకు ఆసరాగా ఉంటాడకుంటే తలకొరివిపెట్టాల్సి వస్తోందని విలపిస్తున్నారు. గోదావరిఖని సీఐ చిలుకూరి వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. గోదావరిఖని–యైటింక్లయిన్‌కాలనీ ప్రధాన రహదారిపై కోల్‌కారిడార్‌ రోడ్డు పోతనకాలనీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కొడిపెల్లి సందీప్‌(24) అక్కడికక్కడే మృతి చెందగా, ప్రయాణిస్తున్న మరో యువకుడు వూతం రంజిత్‌ తీవ్రగాయాల పాలయ్యాడు. 

గోదావరిఖనిలో జరిగిన ఓ వేడుకలో క్యాటరింగ్‌ పనుల కోసం వెళ్లి పల్సర్‌ వాహనంపై తిరిగి వస్తుండగా పోతనకాలనీ సమీపంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ టేలర్‌కు వెనకభాగాన బలంగా ఢీకొన్నారు. సందీప్‌ యెటింక్లయిన్‌కాలనీ హనుమాన్‌నగర్‌ వాసి. ఎదిగిన కొడుకు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదించడం పలువుర్ని కలిచివేసింది. సీఐ వెంకటేశ్వర్లు కేనుసమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

ఘటనపై అనుమానాలు..
కాగా సంఘటన స్థలంలో మరో ద్విచక్రవాహనానికి చెందిన ముందుభాగం డూమ్‌ పడిపోయి ఉండడంతో ప్రమాదంపై అనుమాలు వ్యక్తమవుతున్నాయి. వేరే ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో అదుపుతప్పి ట్రాక్టర్‌ను ఢీకొన్నారా? లేక నేరుగా ట్రాక్టర్‌ను ఢీకొట్టి అదుపు తప్పి వేరే ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టారా అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. అలాగే ప్రమాదం జరిగిన ప్రాంతంలో స్ట్రీట్‌ లైట్లు లేకపోవడంతో రోడ్డు వెంట చీకటి ఉండటం కూడా సంఘటనకు కారణమని తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement