అంతర్‌జిల్లా దొంగ అరెస్ట్‌

Inter district thief arrested in karimnagar - Sakshi

సిరిసిల్లక్రైం: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పలు చోరీ ల్లో నిందితుడిగా ఉన్న అంతర్‌జిల్లా దొంగను ఆది వారం  రాజన్న సిరిసిల్ల సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. స్పెషల్‌బ్రాంచ్‌ డీఎస్పీ నరహరి వివరాలు వెల్లడించారు. ముస్తాబాద్‌ మండలం సేవాలాల్‌ తండాకు చెందిన రామావత్‌ శంకర్‌ గతేడాది జన వరి నుంచి ఇప్పటి వరకు ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటలో ఆరు దొంగతనాలు, గంభీరావుపే ట మండలంలో రెండు దొంగతనాలు చేశాడు. వేములవాడలోని ఒక షాపులో చోరీచేసే ప్రయత్నంలో పోలీస్‌ జీపు అటువైపుగా వెళ్లడాన్ని గమనించి పరారయ్యాడు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం సిరిసిల్ల పాతబస్టాండ్‌లో పట్టుకున్నారు. దొంగను అరెస్టు చేసిన సీసీఎస్‌ సీఐ బన్సీలాల్, ముస్తాబాద్‌ ఎస్సై ప్రవీణ్, సిరిసిల్ల రూరల్‌ సీఐ అనిల్‌కుమార్, సీసీఎస్‌ ఎస్సై ఉపేందర్‌ను డీఎస్పీ నరహరి అభినందించారు.

గల్ఫ్‌ ఏజెంట్‌...p
సిరిసిల్ల అర్బన్‌ మండలం చంద్రంపేటలో గల్ఫ్‌ పంపిస్తానని మోసం చేసేందుకు ప్రయత్నించిన నకిలీ ఏజెంట్‌ను సీసీఎస్‌ పోలీసులు అరెస్టుచేశారు. మాదం కరుణాకర్‌ ఎలా ంటి అనుమతులు లేకుండా గల్ఫ్‌ ఏజెంటుగా చలామణి అవుతున్నాడు. అతడివద్ద నుంచి ఏడు పాస్‌పోర్టులు, నాలు గు చెక్కులు, మెడికల్‌ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు.  

 

Read latest Karimnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top