2017 యూట్యూబ్‌ టాప్‌ వీడియో ఏదో తెలుసా?

youTube reveals top viral videos of 2017  - Sakshi

శాన్‌ఫ్రాన్సిస్కో:  వీడియో షేరింగ్ వెబ్‌సైట్‌  యూ ట్యూబ్‌  మోస్ట్‌పాపులర్‌ వీడియో ఏదో తెలుసా?  తాజాగా యూ ట్యూబ్‌   2017 అత్యంత జనాదరణ పొందిన వీడియోల జాబితాను విడుదల చేసింది.  వాచింగ్‌, షేరింగ్‌, కమెంట్లు, లైక్లు ఇతర గణాంకాల ఆధారంగా వీటిని ఎంపిక  చేసింది.  వీటిలో "ది మాస్క్ సింగర్"  అనే వీడియో మొదటి స్థానంలో నిలిచింది.

ఈ సంవత్సరపు  వైరల్ వీడియో గా థాయ్‌లాండ్‌   రియాల్టీ షోలో  "అంటిల్ విల్ విల్ బికమ్ డస్ట్"   సాంగ్‌ వీడియో టాప్‌ లో నిలిచింది.  182 మిలియన్ కంటే ఎక్కువ వ్యూస్‌ను ఇది సొంతం చేసుకుంది. అలాగే అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రారంభోపన్యాసంపై రూపొందించిన పేరడీ వీడియో ‘బ్యాడ్‌లిప్‌ రీడింగ్‌’ వీడియోకూడా టాప్‌ ట్రెండింగ్‌ వీడియోస్‌లో ఒకటిగా నిలిచింది. జనవరి 25న ప్లబిష్‌ అయిన ఈ వీడియో 35 మిలియన్లకు పైగా వ్యూలను, 5లక్షల 11వేల లైక్‌లను  27వేలకు కమెంట్లను సాధించింది. అలాగే అమెరికన్‌ పాప్‌స్టార్‌ లేడీ గాగా సూపర్ బౌల్‌ లి,  అమెరికా గాట్‌  టాలెంట్‌  షో లో 12  ఏళ్ల  వెంట్రిలోక్విస్ట్ గానం,  బీబీసీ లైవ్‌ షోలో హల్‌చల్‌ చేసిన ఇద్దరు పిల్లల వీడియో ఈ లిస్ట్‌లో టాప్‌ 10లో నిలిచాయి.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top