ఆ విషయంలో అబ్బాయిల కంటే అమ్మాయిలే స్పీడు | Sakshi
Sakshi News home page

ఆ విషయంలో అబ్బాయిల కంటే అమ్మాయిలే స్పీడు

Published Sun, Oct 5 2014 4:18 PM

ఆ విషయంలో అబ్బాయిల కంటే అమ్మాయిలే స్పీడు - Sakshi

లండన్: ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చాక ప్రయోజనాలతో పాటు దుష్ఫరిణామాలు కూడా కలుగుతున్నాయి. నెట్లో నీలిచిత్రాలు చూస్తున్న వారి సంఖ్య  రానురాను పెరిగిపోతోంది. అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా నీలిచిత్రాలు చూడటం విస్తుగొలిపే అంశం. ఇటీవల నిర్వహించిన ఓ పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది.

మహిళలు.. స్త్రీ, పురుషుల శృంగార చిత్రాల కంటే ఆడవాళ్ల స్వలింగ సంపర్క వీడియోలను చూసేందుకు ఎక్కువగా ఇష్టపడతారట. పరిశోధకులు మూడు కేటగిరిలుగా విభజించి అధ్యయనం చేశారు. అమ్మాయిలు, అబ్బాయిల వైఖరి భిన్నంగా ఉంటుందని తెలిపారు. నీలిచిత్రాలు చూడటాన్ని అబ్బాయిల కంటే అమ్మాయిలు తొందరగా వ్యసనంగా మార్చుకుంటారట. మగవాళ్లు స్వలింగ సంపర్క వీడియోల కంటే సాధారణ పోర్నోగ్రఫీ చూడటానికి ఇష్టపడతారని పరిశోధకులు చెప్పారు.

నీలిచిత్రాలు చూడటం వల్ల కాపురాలు కూలిపోయే ప్రమాదముందని ఇంతకుముందు నిర్వహించన ఓ పరిశోధనలో వెల్లడైంది. ఈ అలవాటు వివాహేతర సంబంధాలకు ఉసిగొల్పుతాయని, వీటి వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, విడాకులకు దారితీయడం వంటి సంఘటనలు జరుగుతాయని హెచ్చరిస్తున్నారు.
 

Advertisement
Advertisement