సౌదీ ఎన్నికల్లో మహిళావిజయం | Women victory in Saudi election | Sakshi
Sakshi News home page

సౌదీ ఎన్నికల్లో మహిళావిజయం

Dec 14 2015 12:50 AM | Updated on Aug 20 2018 7:34 PM

సౌదీ అరేబియాలోని మున్సిపల్ కౌన్సిల్‌లకు జరిగిన ఎన్నికల్లో తాజా సమాచారం మేరకు కనీసం 13 మంది మహిళలు విజయం

 రియాద్: సౌదీ అరేబియాలోని మున్సిపల్ కౌన్సిల్‌లకు జరిగిన ఎన్నికల్లో తాజా సమాచారం మేరకు కనీసం 13 మంది మహిళలు విజయం సాధించారు. దేశ చరిత్రలో తొలిసారి మహిళలకు ఓటుహక్కు కల్పించడంతోపాటు వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రక్రియకు ఇన్నాళ్లూ దూరంగా ఉన్న సౌదీ మహిళలు.. పరిమిత సంఖ్యలోనైనా విజయం సాధించడం వారి అభివృద్ధికి ముందడుగుగా భావిస్తున్నారు.

మద్రఖా గ్రామంలో సల్మా అల్ ఒతీబి, జిడ్డాలో లామా అల్ సులేమాన్, అల్ జాఫ్ ప్రాంతంలో హినుఫ్ అల్ హజ్మీ, తాబుక్ ప్రాంతంలో మోనా ఎల్ ఎమెరీ, ఫాదిలా అల్ అట్టవీ గెలుపొందారని సౌదీ అధికార వార్తా సంస్థ తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement