కరోనా మీ భార్య: కంట్రోల్‌ చేయలేక.. | Women Slams Mohammad Mahfud MD Over Comments On Corona | Sakshi
Sakshi News home page

కరోనాపై వ్యంగ్యం: మంత్రిపై మహిళల ఫైర్‌

May 29 2020 4:38 PM | Updated on May 29 2020 5:05 PM

Women Slams Mohammad Mahfud MD Over Comments On Corona - Sakshi

ఇండోనేషియా రక్షణ శాఖ మంత్రి మహ్మద్‌ మహ్‌పుద్‌ ఎమ్‌డీ 

కరోనా వైరస్‌ మీ భార్య లాంటిది. మొదట్లో దాన్ని కంట్రోల్‌ చేద్దామని..

జకార్తా : కరోనా లాక్‌డౌన్‌కు సంబంధించిన సడలింపులు అమల్లోకి వస్తున్న నేపథ్యంలో ఇండోనేషియా రక్షణ శాఖ మంత్రి మహ్మద్‌ మహ్‌పుద్‌ ఎమ్‌డీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. కరోనాను ఎదురు తిరిగిన భార్యగా పోల్చటంపై మహిళా సంఘాల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. కొద్దిరోజుల క్రితం ఆయన మాట్లాడుతూ.. ‘‘మనం ఎన్నిరోజులని ఇలా గిరిగీసుకుని కూర్చుంటాం. మనం మన ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూనే పరిస్థితులకు తగ్గట్టు సర్దుకుపోవాలి. బాగా తెలిసిన ఓ వ్యక్తి నుంచి నిన్న నాకో మీమ్‌ వచ్చింది. అందులో.. ‘కరోనా వైరస్‌ మీ భార్య లాంటిది. మొదట్లో దాన్ని కంట్రోల్‌ చేద్దామని భావించారు. ( ‘రైలు కొనాలి.. రూ.3000 కోట్లు ఇస్తారా?’ )

కానీ, అది జరగని పనని అర్థమైంది. ఇక సర్దుకునిపోవటమే మేలని అనుకుంటున్నారు’’ అని ఉందన్నారు. అయితే సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తున్న మహిళా సంఘాలు మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టాయి. ప్రస్తుత కరోనా పరిస్థితులు రాజకీయ నాయకుల చేతగాని తనానికి, మహిళల్ని కించపరిచే తత్వానికి నిదర్శనమని మహిళా సంఘ నాయకురాలు దిండ నిశ యూరా మండిపడ్డారు.

చదవండి : మాజీ ప్రియుడి నెట్‌ఫ్లిక్స్‌ అకౌంట్‌ హ్యాక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement