ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం.! | Woman sucked into the ground | Sakshi
Sakshi News home page

ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం.!

Aug 30 2017 12:21 PM | Updated on Oct 16 2018 5:07 PM

ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం.! - Sakshi

ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం.!

ప్రమాదం అనేది ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పడం ఎవరి వల్ల కాదు.

చైనా: ప్రమాదం అనేది ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పడం ఎవరి వల్ల కాదు.  మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎవరో చేసిన నిర్లక్ష్యంతో మన ప్రాణాల మీదకు వస్తుంది. అందుకే పెద్దలు బయటకు వెళ్లె ముందు ఒళ్లంతా కళ్లు పెట్టుకుని ఉండాలని చెబుతుంటారు. చైనాలోని షెన్జెన్‌ నగరంలో ఉన్న క్యుజు మెట్రో స్టేషన్‌లో ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. ఇది ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

మెట్రో స్టేషన్‌లో ఎస్కలేటర్‌ వైపు వెళ్తున్న ఓ మహిళ ఫ్లోర్‌ కిందకి పడిపోయింది. అప్పటికే పాడైపోయిన ఫ్లోర్‌ని గమనించకపోవడంతో ఈ ఘటన జరిగింది. ఆమెతో పాటే ఉన్న వ్యక్తి తన కళ్ల ముందే లోపలికి పడివోడంతో గుండె గుబేలు మనింది. కొన్ని సెకండ్లపాటు ఆమె కనిపించకపోవడంతో  ఆతనికి ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడ ఉన్న కొందరు సహయం చేయడంతో ఆమె ప్రమాదం నుంచి బయటపడింది. 
Advertisement
 
Advertisement
Advertisement