రాత్రివేళ బీచ్‌లో స్నానం చేస్తుండగా.. | Woman fails to save friend in Australian crocodile attack | Sakshi
Sakshi News home page

రాత్రివేళ బీచ్‌లో స్నానం చేస్తుండగా..

May 30 2016 12:24 PM | Updated on Sep 4 2017 1:16 AM

బీచ్లో స్నానానికి వెళ్లిన ఇద్దరు మహిళల్లో ఒక మహిళపై మొసలి దాడి చేసింది. అమాంతం ఆమె పిక్కను పట్టి లోపలికి ఈడ్చుకెళ్లింది.

ఆస్ట్రేలియా: బీచ్లో స్నానానికి వెళ్లిన ఇద్దరు మహిళల్లో ఒక మహిళపై మొసలి దాడి చేసింది. అమాంతం ఆమె పిక్కను పట్టి లోపలికి ఈడ్చుకెళ్లింది. తన స్నేహితురాలిని రక్షించేందుకు ఆమె ఎంత ప్రయత్నించినప్పటికీ మొసలి బలం ముందు నిలవలేకపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం న్యూ సౌత్ వేల్స్ లోని లిత్గో అనే ప్రాంతానికి చెందిన 47 మహిళ, ఆమె స్నేహితురాలు కలిసి క్వీన్స్ లాండ్ రాష్ట్రంలోని డెయిన్ ట్రీ నేషనల్ పార్క్ వద్ద ఉన్న థోర్న్టన్  బీచ్ వద్ద ఆదివారం రాత్రి స్నానం చేసేందుకు వెళ్లారు.

నడుం లోతు వరకు ఉన్న నీళ్ల వద్దకు వెళ్లి స్నానం చేస్తున్నారు. ఆ సమయంలోనే ఒక ముసలి దాడి చేసింది. అందులో ఒక మహిళను గట్టిగా నోట కరిచి లోపలికి ఈడ్చుకెళ్లింది. ఈ క్రమంతో తన స్నేహితురాలిని రక్షించేందుకు ప్రయత్నించినా ఆమెను కూడా ముసలి గాయపరిచింది. ముసలి ఈడ్చుకెళ్లిన మహిళ కోసం అక్కడ రెస్క్యూ టీం ఎంత ప్రయత్నించినా దొరకలేదు. దీంతో సోమవారం మరోసారి గాలింపు చర్యలు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement