ఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్‌లో వర్షం : వైరల్‌ | Water Pours Into Airport In London | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్‌లో వర్షం : వైరల్‌

Aug 12 2019 4:32 PM | Updated on Aug 12 2019 5:23 PM

Water Pours Into Airport In London - Sakshi

తడిసిపోకుండా ఉండేలా సురక్షితమైన ప్రదేశం కోసం నానా తంటాలు..

లండన్‌ : లూటన్‌ విమానాశ్రయంలో చోటుచేసుకున్న సంఘటన ప్రస్తుతం వైరల్‌గా మారింది. నిత్యం బిజీగా ఉండే ఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్‌లో కుండపోతగా వర్షం కురిసింది. యూరో న్యూస్‌ కథనం ప్రకారం.. శుక్రవారం లూటన్‌ ఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్‌ పైకప్పు గుండా కుండపోతగా వర్షం కురిసింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. టెర్మినల్‌లో వర్షం కురవటం ఏంటని కాసేపు తికమకపడ్డారు. తమ సామాగ్రి తడిసిపోకుండా ఉండేలా సురక్షితమైన ప్రదేశం కోసం నానా తంటాలు పడ్డారు. గత కొన్ని రోజులుగా యు.కే అంతటా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. వర్షం కారణంగా 15 నిమిషాలు ప్రయాణికులకు అంతరాయం కలిగింది. ప్రస్తుతం ఈ వీడియో ట్విట్టర్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ట్విట్టర్‌ వేదికగా  పలువురు నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్‌ చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement