
రోమ్ : టెన్నిస్ ఆటను సాధారంణంగా గ్రాస్ కోర్టు, హార్డ్ కోర్టులో ఆడుతారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతగా ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఏ గ్రౌండ్‌కో వెళ్లి అక్కడ నెట్స్‌ను ఉపయోగించి ఆడుతారు. కానీ ఇటలీకి చెందిన ఇద్దరు అమ్మాయిలు మాత్రం టెన్నిస్ ఆటను బిల్డింగ్ టాప్ రూఫ్‌లో ఆడడం ప్రత్యేకతను సంతరించుకొంది. వివరాల్లోకి వెళితే.. ఇటలీకి చెందిన ఇద్దరు అమ్మాయిలు అక్కడి లోకల్ టెన్నిస్ క్లబ్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. అయితే కరోనా నేపథ్యంలో ఎవరి ఇంట్లో వారే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో తమ టెన్నిస్ ప్రాక్టీస్‌ను ఆపకూడదనే ఉద్దేశంతో ఎవరి బిల్డింగ్ టెర్రస్ మీదకు వారు ఎక్కి టెన్నిస్ ప్రాక్టీస్ చేశారు. అయితే బిల్డింగ్ మధ్య ఉన్న గ్యాప్‌ను నెట్‌గా వాడుకోవడం మొదలుపెట్టారు. అయితే ఆడుతున్నంత సేపు ఒక్కసారి కూడా తమ ఏకాగ్రత కోల్పోకుండా బ్యాక్‌హ్యాండ్, ఫోర్‌హ్యాండ్ షాట్లతో ప్రాక్టీస్‌ను కొనసాగించారు. కరోనా మహమ్మారి ఉన్నా సరే తమ ప్రాక్టీస్ కొనసాగుతూనే ఉంటుందని వీడియోలో తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
(వైద్యులపై దాడులకు నిరసనగా బ్లాక్ డే)