
ఐక్యరాజ్య సమితి: భారత్–ఫ్రాన్స్ దేశాల మధ్య రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందం కుదిరే సమయానికి తాను పదవిలోకి రాలేదని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్ అన్నారు. రాఫెల్ ఒప్పందం రెండు ప్రభుత్వాల మధ్య కుదిరిందని, ఇది కేవలం వాణిజ్య సంబంధమే కాదని, వ్యూహాత్మకమైనది అని అన్నారు. ‘ఒప్పందంపై సంతకాలు జరిగినప్పుడు నేను అధికారంలో లేను. ప్రధాని మోదీ కొన్ని రోజుల క్రితం ఏం చెప్పారో నేనూ అదే చెప్పాలనుకునుకుంటున్నా’ అని మాక్రన్ అస్పష్ట సమాధానం ఇచ్చారు.
ప్రతిదానిలో లాగుతున్నారు: వాద్రా
నాలుగేళ్లుగా బీజేపీ నిరాధార ఆరోపణలతో తనపై రాజకీయ కక్షసాధింపునకు పాల్పడుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రా ఆరోపించారు. రూపాయి పతనం, ఇంధన ధరల పెరుగుదల, రాఫెల్ వివాదం..ఇలా ఎప్పుడు ఇరకాటంలో పడినా ప్రతిసారి అధికార పార్టీ తన పేరును తెరపైకి తెస్తోందని మండిపడ్డారు.