దేశం, పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కీలకమైన అధ్యక్ష ఎన్నికల్లో ఓటేయాలని అఫ్ఘానిస్థాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ఇచ్చిన పిలుపుతో ప్రజలు స్పందించారు.
అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్ల క్రూరత్వం
కాబూల్: దేశం, పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కీలకమైన అధ్యక్ష ఎన్నికల్లో ఓటేయాలని అఫ్ఘానిస్థాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ఇచ్చిన పిలుపుతో ప్రజలు స్పందించారు. మొత్తం 1.35 కోట్ల మంది ఓటర్లలో దాదాపు 52 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. అయితే మరోవైపు ఓటేస్తే దాడి చేస్తాం అంటూ తాలిబన్ ఉగ్రవాదులు చేసిన హెచ్చరికలు తీవ్ర ప్రభావం చూపించాయి. వారు అన్నట్లుగానే హీరట్ రాష్ట్రంలో ఓటు వేసినట్లు సిరా గుర్తు ఉన్న 11 మంది పౌరుల చేతివేళ్లను శనివారం నరికివేశారు.