విజయ్‌ మాల్యాకు ఎదురుదెబ్బ

Vijay Mallya as UK High Court rejects his plea against extradition - Sakshi

భారత్‌కు అప్పగింతపై విచారణకు అనుమతించని యూకే హైకోర్టు

లండన్‌: మద్యం వ్యాపారి విజయ్‌ మాల్యా(63)కు బ్రిటన్‌ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తనను భారత్‌కు అప్పగించాలంటూ యూకే హోం శాఖ తీసుకున్న నిర్ణయంపై విచారణకు అనుమతించాలంటూ ఆయన పెట్టుకున్న అర్జీని యూకే హైకోర్టు తిరస్కరించింది. అప్పగింత నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ తన వాదనలకు అనుమతించాలంటూ మాల్యా హైకోర్టులో అప్పీలు చేసుకున్నారు. ఈనెల 5వ తేదీన జస్టిస్‌ విలియం డేవిస్‌ ఈ అప్పీలును తిరస్కరించారని న్యాయ విభాగం ప్రతినిధి తెలిపారు. మాల్యాకు వచ్చే శుక్రవారంలోగా మౌఖికంగా  విజ్ఞప్తి చేసుకునే అవకాశం ఉందన్నారు. విజ్ఞప్తి విన్నాక మాల్యా అప్పీలును పూర్తిస్థాయి విచారణకు అనుమతించాలా వద్దా అనేది జడ్జి నిర్ణయిస్తారని తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top