అతి నవ్వు ఆమె ఆయుష్షు తీసింది | US Woman Fell Off from Balcony whiling laughing and Dies | Sakshi
Sakshi News home page

అతి నవ్వు ఆమె ఆయుష్షు తీసింది

Aug 20 2017 2:12 PM | Updated on Sep 17 2017 5:45 PM

అతి నవ్వు ఆమె ఆయుష్షు తీసింది

అతి నవ్వు ఆమె ఆయుష్షు తీసింది

అతిగా నవ్వు ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.

వాషింగ్టన్‌:  నవ్వు ఆయుష్షు పెంచటం మాట ఏమోగానీ మెక్సికోలో మాత్రం ఓ టీచర్‌ ప్రాణాలు తీసింది. బిగ్గరగా నవ్వుతూనే పై అంతస్తు నుంచి పడిపోయి ప్రాణాలు కోల్పోయింది.
 
షారోన్‌ రెగోలి సిఫోర్రోనో (50)  పెన్నిసైల్వేనియాలోని హుస్టన్‌ మిడిల్‌ స్కూల్‌లో టీచర్‌ గా పని చేస్తోంది. సమ్మర్‌ సెలవులు కావటంతో సోమవారం  తన కూతురితో ఓ స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. అక్కడ సరదాగా బాల్కనీలో ఓ బెంచ్‌ మీద కబుర్లు చెబుతూ గడిపింది. ఇంతలో ఏం జరిగిందో తెలీదుగానీ బిగ్గరగా నవ్వటం ప్రారంభించిన ఆమె ఆ కుదుపులో వెనక్కి ఒరిగి, అదుపు తప్పి బాల్కనీ నుంచి కింద పడిపోయింది. 
 
తలకు తీవ్రగాయాలు కావటంతో ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించింది. ఆ సమయంలో ఆమె మద్యం సేవించి ఉన్నట్లు అనుమానించినా.. తర్వాత పరీక్షల్లో నిజం కాదని తేలింది. బాల్కనీకి రక్షణ చర్యలు లేకపోవటమే ప్రమాదానికి కారణమైందని పోలీసులు తెలిపారు. వివాహిత అయిన రెగోలికి ఇద్దరు పిల్లలు. 

Advertisement
 
Advertisement
Advertisement