రెండేళ్ల కూతురిని హాట్ ఓవెన్పై పెట్టి.. | US: Two-year-old suffers burns after mom puts her in oven | Sakshi
Sakshi News home page

రెండేళ్ల కూతురిని హాట్ ఓవెన్పై పెట్టి..

Mar 21 2016 4:54 PM | Updated on Sep 3 2017 8:16 PM

రెండేళ్ల కూతురిని హాట్ ఓవెన్పై పెట్టి..

రెండేళ్ల కూతురిని హాట్ ఓవెన్పై పెట్టి..

అమెరికాలోని టెక్సాస్లో హాచర్ (35) అనే ఓ తల్లి మాతృత్వానికి మచ్చ తెచ్చేచర్యకు పాల్పడింది. చక్కగా ముద్దులొలికే మాటలు పలుకుతూ, వడివడిగా అడుగులు వేసే తన చిన్నారిని ఆడించాల్సిందిపోయి హాట్ ఓవెన్పై పెట్టింది.

న్యూయార్క్: అమెరికాలోని టెక్సాస్లో హాచర్ (35) అనే ఓ తల్లి మాతృత్వానికి మచ్చ తెచ్చేచర్యకు పాల్పడింది. చక్కగా ముద్దులొలికే మాటలు పలుకుతూ, వడివడిగా అడుగులు వేసే తన చిన్నారిని ఆడించాల్సిందిపోయి హాట్ ఓవెన్పై పెట్టింది. దీంతో ఆ పాపకు తీవ్ర గాయాలయ్యాయి. పాప ఏడుపు విని చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి జైలుకు తరలించారు.

తీవ్రంగా గాయపడిన పాపను తొలుత టెక్సాస్ లోని మెథడిస్ట్ ఆస్పత్రిలో చేర్పించి అనంతరం డల్లాస్ లోని పార్క్ లాండ్ బర్న్ సెంటర్కు తరలించారు. ప్రస్తుతానికి ఆ బాలిక ఆరోగ్యం స్థిమితంగానే ఉందని ఒకప్పుడు హ్యాచర్దగ్గర పనిచేసిన మహిళ ఒకరు చెప్పారు. అయితే హాచర్ ఎందుకు ఇలా చేసిందనే విషయంపై మాత్రం వివరాలు తెలియరాలేదు. కొద్ది రోజుల కిందట నాలుగేళ్ల బాలుడిని ఇదే ప్రాంతంలో సవతి తల్లి వేడి నీళ్లలో పెట్టడంతో అతడు తీవ్రగాయాలతో చనిపోయిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి ఘటన మరోసారి చోటుచేసుకోవడం అధికారులు సీరియస్ గా ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement