కంప్యూటర్ గేమ్ పిచ్చిలో పడి కూతుర్నే.. | US man kills 2-year-old daughter for interrupting computer games | Sakshi
Sakshi News home page

కంప్యూటర్ గేమ్ పిచ్చిలో పడి కూతుర్నే..

Apr 27 2016 12:40 PM | Updated on Aug 24 2018 4:57 PM

కంప్యూటర్ గేమ్ పిచ్చిలో పడి కూతుర్నే.. - Sakshi

కంప్యూటర్ గేమ్ పిచ్చిలో పడి కూతుర్నే..

అమెరికాలో దారుణం జరిగింది. కంప్యూటర్ గేమ్స్ ఆడుకుంటున్న తనను డిస్ట్రబ్ చేసిందనే కోపంతో ఓ 31 ఏళ్ల తండ్రి తన రెండేళ్ల కూతురును చంపేశాడు.

న్యూయార్క్: అమెరికాలో దారుణం జరిగింది. కంప్యూటర్ గేమ్స్ ఆడుకుంటున్న తనను డిస్ట్రబ్ చేసిందనే కోపంతో ఓ 31 ఏళ్ల తండ్రి తన రెండేళ్ల కూతురును చంపేశాడు. గొంతుపట్టి పిసికి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. అంథోని మైఖెల్ సాండర్స్ అనే వ్యక్తి గత డిసెంబర్లో ఎల్లీ శాండర్స్ అనే తన రెండేళ్ల కూతురు, ఐదేళ్ల కుమారుడు బాధ్యతలు చూసుకుంటున్నాడు.

అయితే అతడు ఎలా ఆ బాలికను చంపాడనే విషయాన్ని పోలీసులు తెలుపుతూ 'ఆ సమయంలో అతడు కంప్యూటర్ గేమ్ లో విపరీతంగా లీనమై ఉన్నాడు. బహుషా.. ఆ సమయంలో ఆ పాప అతడిని డిస్ట్రబ్ చేసి ఉంటుంది. అందుకే అతడు కొట్టడమే కాకుండా ఊపిరాడకుండా చేసి చంపేసి ఉంటాడు. పోస్టుమార్టం నివేదిక కూడా ఆ పాపకు శ్వాస ఆడకచనిపోయిందని, రెండుమూడు గాయాలు కూడా ఉన్నాయని తెలిపింది' అని చెప్పారు. తన భార్య ఒక ఆర్ట్ షోకు వెళ్లినప్పుడు అతడు ఈ అఘాయిత్యం చేసినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement