breaking news
computer game
-
కంప్యూటర్ గేమ్ పిచ్చిలో పడి కూతుర్నే..
న్యూయార్క్: అమెరికాలో దారుణం జరిగింది. కంప్యూటర్ గేమ్స్ ఆడుకుంటున్న తనను డిస్ట్రబ్ చేసిందనే కోపంతో ఓ 31 ఏళ్ల తండ్రి తన రెండేళ్ల కూతురును చంపేశాడు. గొంతుపట్టి పిసికి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. అంథోని మైఖెల్ సాండర్స్ అనే వ్యక్తి గత డిసెంబర్లో ఎల్లీ శాండర్స్ అనే తన రెండేళ్ల కూతురు, ఐదేళ్ల కుమారుడు బాధ్యతలు చూసుకుంటున్నాడు. అయితే అతడు ఎలా ఆ బాలికను చంపాడనే విషయాన్ని పోలీసులు తెలుపుతూ 'ఆ సమయంలో అతడు కంప్యూటర్ గేమ్ లో విపరీతంగా లీనమై ఉన్నాడు. బహుషా.. ఆ సమయంలో ఆ పాప అతడిని డిస్ట్రబ్ చేసి ఉంటుంది. అందుకే అతడు కొట్టడమే కాకుండా ఊపిరాడకుండా చేసి చంపేసి ఉంటాడు. పోస్టుమార్టం నివేదిక కూడా ఆ పాపకు శ్వాస ఆడకచనిపోయిందని, రెండుమూడు గాయాలు కూడా ఉన్నాయని తెలిపింది' అని చెప్పారు. తన భార్య ఒక ఆర్ట్ షోకు వెళ్లినప్పుడు అతడు ఈ అఘాయిత్యం చేసినట్లు చెప్పారు. -
హీరో కాదు... విలనే!
అధ్యయనం మందు కొట్టినప్పుడు అబద్ధాలాడితే ‘‘ఏదో తాగి వాగాను గురూ. లైటుగా తీసుకో’’ అంటూ ఒక సాకును వెతుక్కోవచ్చు. మరి మందు కొట్టకుండానే అబద్దాలు ఆడితే... ఆ పాపం ఎవరిది? కచ్చితంగా ఆక్సిటోసిన్ హార్మోన్‌దే అంటున్నారు పరిశోధకులు. నిజానికి ‘ఆక్సిటోసిన్’కి మంచి పేరు ఉంది. ‘లవ్ హార్మోన్’ అని కూడా దీన్ని పిలుస్తారు. ప్రేమలో పడడానికి, బంధాలు దృఢతరం కావడానికి ఈ హార్మోన్ తోడ్పడుతుంది... అని కూడా ఎంతో మంది కితాబు ఇచ్చారు. మరి అలాంటి ‘హీరో’ హార్మోన్లో ఇప్పుడు ‘విలన్’ కోణం బయటపడింది. ఒక మాదిరి అబద్ధాల నుంచి శుద్ధ అబద్ధాలు ఆడడానికి కారణం ఆక్సిటోసిన్ ప్రభావమేనని ఇజ్రాయెల్‌లోని యూనివర్శిటీ ఆఫ్ నెగెవ్ పరిశోధక బృందం చెబుతుంది. వీరు తమ పరిశోధన కోసం రెండు బృందాలను ఎంచుకొని, ఒక కంప్యూటర్ గేమ్‌ను డిజైన్ చేసి... దీని ఆధారంగా కొన్ని నిర్ధారణలకు వచ్చారు. రెండు బృందాలలోని వారూ అబద్ధం చెప్పినప్పటికీ, ఆక్సిటోసిన్ విడుదలైన వారు మాత్రం ఎక్కువ అబద్ధాలాడారు. ఆక్సిటోసిన్ పరిమాణం పెరుగుతున్నకొద్దీ ‘అబద్ధాల తీవ్రత’ అంతకంతకూ పెరుగుతూ పోయింది. పి.యస్: అంటే అబద్ధమాడి దొరికిపోతే ‘‘తప్పు నాది కాదు... ఆక్సిటోసిన్ది. అంతే!’’ అని డైలాగు కొట్టొచ్చన్నమాట!