వైమానిక దాడిలో 15 మంది సిరియా పౌరులు హతం | US-led airstrikes kill 15 civilians in Syria | Sakshi
Sakshi News home page

వైమానిక దాడిలో 15 మంది సిరియా పౌరులు హతం

Feb 17 2016 7:53 AM | Updated on Aug 24 2018 7:24 PM

ఐఎస్ఐఎస్ ను మట్టుపెట్టేందుకు అమెరికా విసురుతున్న బాంబులు గురితప్పుతున్నాయి.

దమస్కస్: ఐఎస్ఐఎస్ ను మట్టుపెట్టేందుకు అమెరికా విసురుతున్న బాంబులు గురితప్పుతున్నాయి. సిరియాలోని అల్ హసాక్ ప్రావిన్స్ షాదెద్ పట్టణంపై మంగళవారం అమెరికా  అమెరికా వైమానిక దళం ఆధ్వర్యంలో నిర్వహించిన దాడిలో 15 మంది అమాయక ప్రజలు అసువులుబాశారు.

 

ఐఎస్ కు పట్టున్న ఈ ప్రాంతంలో, ఉగ్రవాదుల స్థావరాలను గుర్తించాకే వైమానిక దాడులు నిర్వహించాల్సిఉంటుంది. కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఒక్కసారిగా గగనతలం నుంచి బాంబులు విసిరారని, చనిపోయినవారంతా సాధారణ పౌరులని యుద్ధక్షేత్రాన్ని పర్యవేక్షిస్తున్న బ్రిటన్ సంస్థ ఒకటి పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement