భారత్‌కు అమెరికా అత్యాధునిక ఆయుధాలు! | US government proceed towards High-tech weapons to India | Sakshi
Sakshi News home page

భారత్‌కు అమెరికా అత్యాధునిక ఆయుధాలు!

Oct 3 2013 1:35 AM | Updated on Sep 1 2017 11:17 PM

అత్యాధునిక ఆయుధాలను, సాంకేతికతను భారత్‌కు అందజేసేందుకు అమెరికా ముందుకొచ్చింది. ఇందుకోసం ఒబామా ప్రభుత్వం తమకు అత్యంత విశ్వసనీయమైన దేశాల జాబితాలోకి భారత్‌ను చేర్చింది.

వాషింగ్టన్: అత్యాధునిక ఆయుధాలను, సాంకేతికతను భారత్‌కు అందజేసేందుకు అమెరికా ముందుకొచ్చింది. ఇందుకోసం ఒబామా ప్రభుత్వం తమకు అత్యంత విశ్వసనీయమైన దేశాల జాబితాలోకి భారత్‌ను చేర్చింది. ఈ మేరకు ఇప్పటికే పది సున్నితమైన టెక్నాలజీలను అందజేస్తామని ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం భారత్ నిర్ణయం తీసుకోనుంది. ఇంతేగాకుండా మరిన్ని ఆయుధ టెక్నాలజీలను భారత్‌కు అందజేయడంపై అభిప్రాయాన్ని తెలపాల్సిందిగా అమెరికా రక్షణ పరిశ్రమలను ఒబామా యంత్రాంగం కోరింది. అమెరికా రక్షణశాఖ వర్గాల సమాచారం ప్రకారం.. దాదాపు 90 రకాల ఆయుధాలు, టెక్నాలజీలను మిత్రదేశాలకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement