
'ఆందోళనగా ఉంది.. శాంతి పాటించండి'
పాకిస్థాన్ భూభాగంలోకి చొరబడి భారత్ సర్జికల్ దాడులు నిర్వహించడంపట్ల ఐక్యరాజ్య సమితి స్పందించింది.
న్యూయార్క్: పాకిస్థాన్ భూభాగంలోకి చొరబడి భారత్ సర్జికల్ దాడులు నిర్వహించడంపట్ల ఐక్యరాజ్య సమితి స్పందించింది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను తెలుసుకుంటూనే ఉన్నామని, ఈ విషయంలో తీవ్ర ఆందోళనగా ఉందని ఐరాస సెక్రటరీ జనరల్ డ్యుజారిక్ అన్నారు. ఐక్యరాజ్య సమితికి చెందిన మిలిటరీ వ్యవహారాల వర్గం భారత్ వర్సెస్ పాక్ మధ్య జరుగుతున్న కాల్పులు విరమణ ఒప్పంద ఉల్లంఘనలు పరిశీలిస్తూనే ఉందని, మరింత సమాచారం తెలుసుకోవాల్సింది ఉందని చెప్పారు.
ఇరు దేశాలు సంయమనం పాటించాలని, సమస్య ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, వెంటనే ఇరు దేశాలు పరిస్థితిని యథాస్థితికి తీసుకొచ్చే కార్యక్రమాలు చేపట్టాలని అభిప్రాయపడ్డారు. పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి సర్జికల్ దాడులు నిర్వహించిన భారత్ 40మంది ఉగ్రవాదులను హతం చేసిన విషయం తెలిసిందే.