చైనా లింకులున్న ట్విటర్‌ అకౌంట్లు నిలిపివేత

Twitter removes China-linked accounts spreading false news - Sakshi

లండన్‌: చైనా ప్రభుత్వానికి మద్దతుగా ట్వీట్లు చేస్తున్న, చైనాతో సంబంధమున్న ట్విటర్‌ ఖాతాలను ఆ సంస్థ నిలిపివేసింది. ఆయా ట్వీట్లలో చైనా ప్రభుత్వానికి మద్దతుగా వ్యాఖ్యలు ఉంటుండడంతో, ట్విటర్‌ సంస్థ చైనా ప్రభుత్వాన్ని సంప్రదించింది. అయితే, అవి తమవి కాదని వారు తెలపడంతో దాదాపు 23,750 ఖాతాలను నిలిపివేసినట్లు ట్విటర్‌ ప్రకటించింది. ఈ ఖాతాలు చేస్తున్న ట్వీట్లను రీట్వీట్‌ చేస్తున్న మరో 1,50,000 అకౌం ట్లను సైతం నిలిపివేసింది. చైనాలో ట్విటర్‌ సహా, ఫేస్‌ బుక్, యూట్యూబ్‌ వంటి సర్వీసులపై నిషేధం ఉన్న విషయం తెలిసిందే. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top