ట్రంప్ రెండో భార్య కోరిక ఏంటో తెలుసా? | Trump's second wife Marla Maples 'is hoping to become a UN ambassador | Sakshi
Sakshi News home page

ట్రంప్ రెండో భార్య కోరిక ఏంటో తెలుసా?

Nov 19 2016 12:12 PM | Updated on Aug 25 2018 7:50 PM

ట్రంప్ రెండో భార్య కోరిక ఏంటో తెలుసా? - Sakshi

ట్రంప్ రెండో భార్య కోరిక ఏంటో తెలుసా?

అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ మాజీ రెండో భార్య మోడల్, నటి మర్లా మాపిల్స్(52) కూడా పదవిని ఆశిస్తున్నారు.

న్యూయార్క్: అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ మాజీ రెండో భార్య మోడల్, నటి మర్లా మాపిల్స్(52) కూడా పదవిని ఆశిస్తున్నారు. ఆమె ఆఫ్రికా తరుపున ఐక్యరాజ్యసమితిలో రాయబారిగా పనిచేయాలని భావిస్తున్నారు. గత బుధవారం ఆమె ట్రంప్ టవర్స్ ఎదురుగా కనిపించారు. మర్లా, ట్రంప్లు 1993లో వివాహం చేసుకున్నారు.

వీరి మధ్య బంధం ఆరేళ్లపాటు కొనసాగింది. 1999లో విడిపోయారు. వీరిద్దరికి టిఫాని అనే కూతురు కూడా ఉంది. ప్రస్తుతం ఆ కూతురు ఆమెతోనే ఉంది. దాతృత్వం అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకునే మర్లా ప్రస్తుతం ఆఫ్రికాలోనే స్వచ్ఛంద సేవలు అందిస్తున్నారు. ఇటీవలె ఆమె తన కూతురితో కలిసి అక్కడికి వెళ్లారని అధికార వర్గాల సమాచారం. అయితే, ట్రంప్ విజయం తర్వాత అమెరికా ప్రభుత్వం ద్వారా తనను ఆఫ్రికాలో ఐక్యరాజ్య సమితి రాయబారిగా ఎంపిక చేయాలని కోరేందుకు ట్రంప్ టవర్స్ వద్దకు వచ్చినట్లు సమాచారం.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement