కిమ్‌ను వీడియోతో పడగొట్టిన ట్రంప్‌..!!

Trump Shows Kim Jong Un A Video That Played Crucial Role In Meeting - Sakshi

సింగపూర్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సింగపూర్‌ శిఖరాగ్ర సమావేశానికి ఓ ప్రత్యేక వీడియోతో వెళ్లారు. అణ్వస్త్ర నిరాయుధీకరణకు ఉత్తరకొరియా ఒప్పుకుంటే భవిష్యత్‌లో ఆ దేశం ఎలా మారుతుందో ఆ వీడియోలో చూపించారు. ఈ వీడియోను తన ఐపాడ్‌లో ట్రంప్‌ కిమ్‌కు చూపారు.

నాలుగు నిమిషాల పాటు ఉన్న వీడియోను చూపిన అనంతరం ఆర్థికంగా, సాంకేతికంగా అభివృద్ధి చెందిన భవిష్యత్‌ కోసం సరైన నిర్ణయాన్ని తీసుకోవాలని ట్రంప్‌ కిమ్‌ను కోరినట్లు తెలిసింది.

సాంకేతికతలో దూసుకుపోతున్న చైనా, దక్షిణ కొరియాల మధ్యలో ఉన్న ఉత్తరకొరియా అతి తర్వగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని ట్రంప్‌ పేర్కొన్నారు. మరి కిమ్‌ జాంగ్‌ ఉన్‌ను విపరీతంగా ఆకర్షించిన ఆ వీడియోను మీరు తిలకించండి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top