ట్రంప్‌ గోల్ఫ్‌ సరదాపై విమర్శలు

Too Much Golf Woman Shows Middle Finger to Trump - Sakshi

వర్జీనియా : ప్రపంచానికి పెద్దన్నగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పదవికి ఓ గౌరవం ఉంది. కానీ, తన విధానాల వల్లనో లేక గత చరిత్ర మూలంగానే ఏమో డొనాల్డ్‌ ట్రంప్‌పై దానిని నిలుపుకోలేకపోతున్నారు. అక్కడి ప్రజలకే ఆయనపై కనీస మర్యాద లేకుండా పోతుంది. గతేడాది ఎన్నికల ప్రచార సమయంలో మొదలైన ఈ వ్యతిరేకత.. ఇంకా కొనసాగుతూనే వస్తోంది. తాజాగా ఆయన పాలనపై వ్యతిరేకత వెల్లగక్కిన ఓ మహిళ చేసిన పని చర్చనీయాంశంగా మారింది. 

ట్రంప్ ప్రతీ వారాంతం వర్జీనియాలోని తన నేషనల్‌ గోల్ఫ్‌ క్లబ్‌లో గడపటం అలవాటుగా చేసుకున్నాడు. ఇందులో భాగంగా మొన్న శనివారం కూడా వెళ్లిన ఆయనకు ఓ మహిళ మధ్య వేలు చూపించేసింది. తిరిగి వైట్‌హౌజ్‌కు పయనమైన క్రమంలో కాన్వాయ్‌ను వెంబడించి మరీ ఆ మహిళ ఆ పని చేసింది. రెండుసార్లు ట్రంప్‌ ఉన్న కారు దగ్గరకు వెళ్లిన ఆమె మిడిల్‌ ఫింగర్‌ సింబల్‌ చూపిస్తూ ముందుకెళ్లింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

అయితే అధికారులు మాత్రం ఈ విషయంపై స్పందించటం లేదు. ఇందుకు సంబంధించిన ఎలాంటి ఫుటేజీ కూడా అక్కడి సీసీ కెమెరాల్లో లేకపోవటం గమనార్హం. ఆ మహిళ ఎవరన్నది తెలియకపోయినా.. ఆమె నిజమైన దేశ భక్తురాలంటూ పలువురు సోషల్ మీడియాలో అభినందనలు కురిపించటం గమనార్హం.

ట్రంప్‌.. జల్సా రాయుడు

ట్రంప్‌ 285 రోజుల పాలనలో 96 రోజులు వైట్‌హౌజ్‌కు దూరంకాగా.. అందులో దాదాపు 80 రోజులు కేవలం గోల్ఫ్‌ క్లబ్‌లోనే గడిపాడంట. పాలన సంగతి పక్కన పెట్టి జల్సాగా గడుపుతున్నాడంటూ ఆయనపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఉండే తక్కువ సమయంలో అస్తవ్యస్త నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపే నిర్ణయాలు తీసుకుంటున్నాడని ఆర్థికవేత్తలు కూడా ఆయనపై మండిపడుతున్నారు. ఇక్కడో విశేషం ఏంటంటే... గతంలో ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో గోల్ఫ్ తెగ ఆడుతున్నాడంటూ ట్రంప్ విమర్శలు చేయటం.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top