రాజకీయ అనిశ్చితి నెలకొన్న మాల్దీవుల్లో శనివారం దేశాధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా చూసేందుకు వివిధ దేశాలకు చెందిన 102 మంది అంతర్జాతీయ పరిశీలకులు మాలె చేరుకున్నారు.
మాలె: రాజకీయ అనిశ్చితి నెలకొన్న మాల్దీవుల్లో శనివారం దేశాధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా చూసేందుకు వివిధ దేశాలకు చెందిన 102 మంది అంతర్జాతీయ పరిశీలకులు మాలె చేరుకున్నారు. భారత మాజీఎన్నికల కమిషనర్ల బృందం కూడా ఈ జాబితాలో ఉంది. ప్రస్తుత అధ్యక్షుడు మొహమ్మద్ వహీద్, మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్, ప్రోగ్రెసివ్ పార్టీఆఫ్ మాల్దీవ్స్ అభ్యర్థి అబ్దుల్లా యమీన్ తదితరులు పోటీలో ఉన్నారు.