మధుమేహం రాకుండా ఉండాలంటే.. | To avoid diabetes..? | Sakshi
Sakshi News home page

మధుమేహం రాకుండా ఉండాలంటే..

Jul 16 2017 1:22 AM | Updated on Sep 5 2017 4:06 PM

మధుమేహం రాకుండా ఉండాలంటే..

మధుమేహం రాకుండా ఉండాలంటే..

రక్తంలో చక్కెర మోతాదు ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉందా? నేడో రేపు..

రక్తంలో చక్కెర మోతాదు ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉందా? నేడో రేపు.. మధుమేహం బారిన పడతామేమో అన్న అనుమానం వెంటాడుతోందా? ఏం ఫర్వాలేదు.. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు.. ఆ మహమ్మారికి చిక్కకుండా తప్పించుకోవచ్చు. చైనా, ఫిన్‌లాండ్, అమెరికాతోపాటు ప్రపంచంలోని అనేక దేశాల్లో మధుమేహంపై జరిగిన పరిశోధనలు అన్నింటినీ మదించి శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని చెబుతున్నారు. అన్నింటికంటే ముందు మన శరీరం బరువును 5 నుంచి 10 శాతం తగ్గించుకోవాలి. వారంలో ఐదు రోజులు.. రోజుకు 30 నిమిషాల పాటు వాకింగ్‌ చేస్తే కనీసం రెండేళ్ల పాటు వ్యాధికి దూరంగా ఉండొచ్చని ఈ అధ్యయనం తెలిపింది.

దీంతోపాటు ఆహారంలో కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. దాదాపు రెండు లక్షల మందిపై జరిగిన అధ్యయనాల ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ అంచనాకు వచ్చారు. పాలకూర, క్యాబేజీ వంటివి ఎక్కువగా తినాలి. కూల్‌డ్రింక్స్‌కు పూర్తిగా దూరంగా ఉండటం ద్వారా కూడా మధుమేహాన్ని దూరం పెట్టొచ్చని యూకే, యూఎస్‌లోని 17 ప్రాంతాల్లో జనాభాపై జరిగిన అధ్యయనం స్పష్టం చేస్తోంది. జంతు ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవడాన్ని తగ్గిస్తే మధుమేహం వచ్చే అవకాశం 20 శాతం వరకు తగ్గుతుంది. వీటితోపాటు గ్లైసీమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం మేలని ఇంకో అధ్యయనం సూచిస్తోంది. రోజూ కాఫీ తాగడం ద్వారా మధుమేహానికి దూరంగా ఉండొచ్చని దాదాపు 85 వేల మందిపై జరిగిన అధ్యయనం ద్వారా తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement