గుండెకు బైపాస్ సర్జరీ చేసినట్లే... వెన్నెముకకూ చికిత్స చే యొచ్చట. గాయాలు లేదా వ్యాధుల వల్ల వెన్నెముక దెబ్బతిని న డక కోల్పోయినవారిని తిరిగి వెన్నెముక బైపాస్ శస్త్రచికిత్సతో నడిపించవచ్చట. ర
గుండెకు బైపాస్ సర్జరీ చేసినట్లే... వెన్నెముకకూ చికిత్స చే యొచ్చట. గాయాలు లేదా వ్యాధుల వల్ల వెన్నెముక దెబ్బతిని న డక కోల్పోయినవారిని తిరిగి వెన్నెముక బైపాస్ శస్త్రచికిత్సతో నడిపించవచ్చట. రక్తనాళాలు మూసుకుపోయి గుండెపోటు ముప్పు పెరిగినప్పుడు శరీరంలో వేరే చోట నుంచి రక్తనాళాన్ని సేకరించి.. మూసుకుపోయిన చోట బైపాస్(ఉపమార్గం)లా కలుపుతారు.
అలాగే, వెన్నెముక దెబ్బతిన్నప్పుడు దానికి మెదడు నుంచి అందే సంకేతాలకు ఆటంకం కలుగుతుంది కాబట్టి.. ఆ సంకేతాలను ఓ కంప్యూటర్ ఇంటర్‌ఫేస్‌ను బైపాస్‌గా చేసుకుని అందిస్తే తిరిగి కదలికలు తె ప్పించవచ్చని జపాన్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఫిజియాలజికల్ సెన్సైస్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. వెన్నెముక దెబ్బతిని కదలికలు కోల్పోయిన కొంతమందికి కంప్యూటర్ బైపాస్ ద్వారా మెదడు సంకేతాలను వెన్నెముకలో దెబ్బతిన్న భాగానికి కింద నాడీవ్యవస్థకు వీరు అనుసంధానం చేయగా.. పక్షవాతానికి గురైనవారు తిరిగి నడవగలిగారట. చేతులు, కండరాల్లో కదలికలు కూడా దీనిద్వారా సాధ్యం అయ్యాయట.


