జీరో సైజ్ ఇల్లు... | The house size zero ... | Sakshi
Sakshi News home page

జీరో సైజ్ ఇల్లు...

Feb 2 2015 2:53 AM | Updated on Sep 2 2017 8:38 PM

జీరో సైజ్ ఇల్లు...

జీరో సైజ్ ఇల్లు...

రెండిళ్ల మధ్య పొడవుగా కనిపిస్తున్న ఈ డబ్బాను చూడండి.

రెండిళ్ల మధ్య పొడవుగా కనిపిస్తున్న ఈ డబ్బాను చూడండి. ఇది కూడా ఇల్లే. కాకపోతే జీరో సైజ్ గృహం. పోలండ్ రాజధాని వార్సాలో ఉన్న ఈ ఇంటి వెడల్పు కేవలం 48 అంగుళాలు మాత్రమే. ఇజ్రాయెల్‌కు చెందిన రచయిత, సినీ దర్శకుడు ఎట్గర్ కెరెట్ ముచ్చటపడి ఈ ఇంటిని కట్టించుకున్నారు. పోలండ్ ఆర్డ్ ఫౌండ్ సహకారంతో జాకబ్ సెజన్సీ అనే ఆర్కిటెక్ట్ ఈ వినూత్న గృహాన్ని నిర్మించారు. రెండంతస్తుల్లో నిర్మించిన ఈ ఇంట్లో సింగిల్ బెడ్ రూంతోపాటు కిచెన్, డైనింగ్ రూం, బాత్‌రూం వంటి అన్ని సౌకర్యాలూ ఉన్నాయి. తన ఇల్లు ఇంత సన్నగా ఉన్నా, చాలా సౌకర్యవంతంగా ఉంటుందని కెరెట్ పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement