ఇక గ్రీన్‌కార్డ్ సులభం | The Green Card is easy | Sakshi
Sakshi News home page

ఇక గ్రీన్‌కార్డ్ సులభం

Nov 22 2014 1:30 AM | Updated on Sep 2 2017 4:52 PM

గ్రీన్‌కార్డ్ పొందడానికి ఇబ్బంది పడుతున్న చాలా మంది భారతీయ ఐటీ ఉద్యోగులకు ఒబామా తాజా నిర్ణయం ఊరటనిస్తుంది.

  • ‘సేమ్ ఆర్ సిమిలర్ జాబ్’ నిర్వచనం మార్పు
  • గ్రీన్‌కార్డ్ పొందడానికి ఇబ్బంది పడుతున్న చాలా మంది భారతీయ ఐటీ ఉద్యోగులకు ఒబామా తాజా నిర్ణయం ఊరటనిస్తుంది. ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం.. గ్రీన్‌కార్డ్(లీగల్‌పర్మనెంట్ స్టేటస్) అప్లికేషన్ ఆమోదం పొందిన తరువాత కూడా  సంబంధిత వీసా అందుబాటులోకి రావడం కోసం ఉద్యోగులు చాలా సంవత్సరాలు ఎదురుచూడాల్సి వచ్చేది. తాజా నిర్ణయం ద్వారా గ్రీన్‌కార్డ్ కోసం ఎదురుచూస్తున్న హైస్కిల్డ్ ఉద్యోగులు, వారి భార్యలకు తాత్కాలిక  ఉద్యోగావకాశం కూడా లభిస్తుంది.

    అందుకు తాజా నిబంధనలను అమెరికా రూపొందించనుంది. ‘అదేరకమైన, లేదా సారూప్యత కలిగిన ఉద్యోగం(సేమ్ ఆర్ సిమిలర్ జాబ్)’ అనే పద నిర్వచనాన్ని కూడా సరళీకరించాలని నిర్ణయించారు. దానివల్ల స్కిల్డ్ ఉద్యోగులు ఉద్యోగాలు మారడం సులువవుతుంది. అలాగే, ఉద్యోగాలు మారినప్పు డు గ్రీన్‌కార్డ్ దరఖాస్తును మార్చడం కూడా ఇకపై మరింత సులువు కానుంది. హెచ్ 4 వీసాపై అమెరికాలో ఉంటున్న జీవిత భాగస్వాములు ఇక వర్క్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

    హెచ్ 1 బీ కోటా నిబంధనల కారణంగా ఇబ్బందులు పడుతున్న వేలాది భారతీయ కుటుంబాలు ఇకపై నిశ్చింతగా ఉండొచ్చు. అమెరికాలో దాదాపు 45 లక్షల మందిభారతీయులు అక్రమంగా ఉంటున్నట్లు అనధికారిక అంచనా. ఒబామా వలస సంస్కరణలను సౌత్ ఏషియన్ అమెరికన్స్ లీడింగ్ టుగెదర్(సాల్ట్) స్వాగతించింది. 9 ఏళ్ల తమ ప్రయత్నం ఫలించిందని ‘ఇమ్మిగ్రేషన్ వాయిస్’ అనే స్వచ్ఛంద సంస్థ ప్రకటించింది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement