'నేను చనిపోలేదు.. బతికేవున్నా' | Taliban chief releases audio message, refuting death rumour | Sakshi
Sakshi News home page

'నేను చనిపోలేదు.. బతికేవున్నా'

Dec 7 2015 9:50 AM | Updated on Jul 12 2019 4:40 PM

'నేను చనిపోలేదు.. బతికేవున్నా' - Sakshi

'నేను చనిపోలేదు.. బతికేవున్నా'

పాకిస్తాన్లో జరిగిన కాల్పుల్లో తాను చనిపోయినట్టు వచ్చిన వార్తలు అబద్ధమని, తాను బతికున్నానని అఫ్ఘానిస్తాన్ తాలిబన్ చీఫ్ ముల్లా అక్తర్ మన్సూర్ వెల్లడించాడు.

ఇస్లామాబాద్: పాకిస్తాన్లో జరిగిన కాల్పుల్లో తాను చనిపోయినట్టు వచ్చిన వార్తలు అబద్ధమని, తాను బతికున్నానని అఫ్ఘానిస్తాన్ తాలిబన్ చీఫ్ ముల్లా అక్తర్ మన్సూర్ వెల్లడించాడు. ఈ మేరకు ఓ ఆడియోను విడుదల చేశాడు.

'పాకిస్తాన్లోని కుచ్లక్ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో  నేను గాయపడినట్టు కానీ చనిపోయినట్టుగా కానీ వచ్చిన వార్తలు అబద్ధం. నాతో పాటు సహచరులు క్షేమంగా ఉన్నారు. నేను కుచ్లక్లో లేను. ప్రత్యర్థులు కుట్రంలో భాగంగా ఈ వదంతులు పుట్టించారు. తాలిబన్ల మధ్య విబేధాలు సృష్టించడం కోసం నేను చనిపోయినట్టు ప్రచారం చేశారు' అని ఆడియోలో మన్సూర్ పేర్కొన్నాడు. పాక్లో మన్సూర్ చనిపోయాడని అఫ్ఘాన్ అధికారి ప్రకటించిన రెండు రోజుల తర్వాత శనివారం ఈ ఆడియోను విడుదల చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement