సమయపాలనలో స్విస్ ఫస్ట్ | switzerland first in time punctuality | Sakshi
Sakshi News home page

సమయపాలనలో స్విస్ ఫస్ట్

Jul 18 2016 6:48 PM | Updated on Sep 4 2017 5:16 AM

సమయపాలనలో స్విస్ ఫస్ట్

సమయపాలనలో స్విస్ ఫస్ట్

గడియారాల ఉత్పత్తిలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన దేశాల్లో , స్విట్జర్లాండ్ ఒకటన్న విషయం మనకు తెల్సిందే.

బెర్న్: గడియారాల ఉత్పత్తిలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన దేశాల్లో , స్విట్జర్లాండ్  ఒకటన్న విషయం మనకు తెల్సిందే. సమయాన్ని కచ్చితంగా పాటించే దేశాల ప్రజల్లో కూడా స్విస్ ప్రజలు ముందున్నారు. అక్కడ ఎవరైనా మనల్ని 12 గంటలకు కలుస్తామంటూ టైమిచ్చినట్లయితే వారు కచ్చితంగా అదే సమయానికి వచ్చి కలుస్తారు. ఐదు నిమిషాల తర్వాతగానీ, ఐదు నిమిషాల ముందుగానీ వారు రారంటే వారు సమయపాలనకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో మనం అర్థం చేసుకోవచ్చు.

 ఎందుకింత కచ్చితమైన సమయాన్ని పాలిస్తారని అక్కడ ఎవరినైనా ప్రశ్నిస్తే వారిచ్చే సమాధానం ఒక్కటే! ‘మేము మీ సమయానికి విలువనిస్తాం. మిమ్మల్ని గౌరవిస్తాం’ అని చెబుతారు. అక్కడి ప్రజలు సమయాన్ని కచ్చితంగా పాటించడానికి అక్కడి రవాణా వ్యవస్థ కూడా వారికి దోహదపడుతోంది. దీశీయ విమానాలు, రైళ్లు, బస్సులు, టాక్సీలు కూడా కచ్చితమైన సమయం ప్రకారం నడుస్తాయి. 87 శాతం రైళ్లు సమయానికి నడుస్తాయని ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. అంటే 13 శాతం రైళ్లు మాత్రమే ఆలస్యంగా నడుస్తాయట. అది కూడా ఎంతో ఆలస్యం కాదు. ఏడాదిలో సరాసరి 32 సెకండ్లు ఆలస్యంగా నడుస్తాయట.

 మాల్స్, దుకాణాలు కూడా కచ్చితమైన సమయాన్ని పాటిస్తాయి. రెండు గంటల్లో సరకును ఇంటికి చేరుస్తామని చెబుతే కచ్చితంగా ఆ సమయానికి పార్శల్ అందుతుంది. టాక్సీలు కూడా నిమిషం తేడా లేకుండా చెప్పిన సమయానికి వస్తాయి. సాయంత్రం నాలుగు గంటలకు అక్కడి కేఫ్‌లు, హోటళ్లు జనంతో కిటకిటలాడుతుంటాయి. కారణం అదే సమయంలో పలు ఆఫీసులు సిబ్బందికి టీ బ్రేక్ ఇస్తారు. టీ సమయం ముగిసిన మరుక్షణం వాళ్లు తమ తమ ఆఫీసుల్లో ఉంటారు. వారికి సమయపాలనపై అంతటి స్ఫూర్తి ఎలా వచ్చిందో మాత్రం తెలియదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement