స్పేస్ ఎక్స్ ప్రయోగానికి నాసా సిద్ధం

SpaceXs 1st Astronaut Launch Unique Moment For US Says NASA - Sakshi

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మరో ప్రయోగానికి సిద్ధమైంది. 2011లో అమెరికా స్పేస్‌ షటిల్‌కు కాలం ముగియడంతో అప్పటి నుంచి రష్యాకు తమ వ్యోమగాముల్ని నింగిలోకి పంపడానికి సాసా కోట్ల డాలర్లు చెల్లిస్తూ వస్తోంది. దీంతో తొమ్మిదేళ్ల తర్వాత తమ వ్యోమగాముల్ని నింగిలోకి పంపడానికి నాసా సర్వం సిద్ధం చేసింది. ఈ ప్రయోగం అమెరికా ప్రతిష్టను నిలబెట్టడంలో కీలకంగా మారనుంది. బుధవారం సాయంత్రం 4 గంటల 33 నిమిషాలకు స్పేష్‌ క్రూడ్‌ ప్లయిట్‌ను ప్రయోగించనున్నారు. చదవండి: హద్దు మీరుతున్న డ్రాగన్‌

అందులో భాగంగానే ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌కు పంపడానికి ఇద్దరు యూఎస్‌ ఆస్ట్రోనాట్స్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ కూడా ఇచ్చింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)కు వెళ్లడానికి ఆస్ట్రోనాట్స్ రాబర్ట్ బెంకన్, డగ్లస్ హర్లే రెడీ అవుతున్నారు. వీరివురు కూడా అన్ని రంగాల్లో శిక్షణ పొందిన నాసా వ్యోమ‌గాముల బృందంలో స‌భ్యులు. హ‌ర్లే గతంలో అంత‌రిక్షంలో 28 రోజుల 11 గంట‌లు, బెంకిన్ కూడా 29 రోజుల 12 గంట‌లు గ‌డిపారు. బెంకిన్‌ 37 గంట‌ల స్పేస్‌వాక్ కూడా చేయడం విశేషం. దీనికి సంబంధించిన ఫైనల్ వెరిఫికేషన్ కూడా ముగిసింది. చదవండి: వైరస్‌లో మార్పులతో ప్రమాదమేమీ లేదు

నాసా స్పేస్ ఎక్స్ క్య్రూ డ్రాగన్ మిషన్ లిఫ్టాఫ్ అవడానికి ప్రాసెస్ క్లియర్ అయిందని యూఎస్ స్పేస్ ఏజెన్సీ ట్విట్టర్‌లో తెలిపింది. షెడ్యూల్ ప్రకారం నేటి సాయంత్రం కెన్నడీ లాంచ్ ప్యాడ్ నుంచి స్పేస్ ఫ్లయిట్ ప్రయాణం ప్రారంభం కానుంది. ఈ ప్రయోగం విజయవంతం అయితే ఐఎస్ఎస్‌కు వెళ్లడానికి సూయజ్ లాంటి రాకెట్స్ కోసం రష్యాపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని అమెరికా భావిస్తోంది. అందుకోసం ప్రముఖ ఎంటర్ ప్రెన్యూర్ ఎలన్ మస్క్ స్థాపించిన​ స్పేస్ ఎక్స్ కంపెనీ రూపొందించిన ఫాల్కన్ 9 అనే రాకెట్ తోపాటు క్రూ డ్రాగన్ అనే స్పేస్ క్రాఫ్ట్‌ను ఎంపిక చేసింది. దీంతో అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపిన మొదటి ప్రైవేటు సంస్థగా స్పేస్ ఎక్స్ నిలువనుంది. స్పేస్ ఎక్స్ మిషన్ కోసం అగ్రరాజ్యం కొన్ని బిలియన్ డాలర్లను వెచ్చించింది.

చదవండి: భారత్‌లో లక్షా 50వేలు దాటిన కరోనా కేసులు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top