
సియోల్ : ఉత్తర కొరియా-దక్షిణ కొరియాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరోసారి ఎక్కువయ్యేట్టుంది. ఉత్తర కొరియాకు చెందిన నౌకను దక్షిణ కొరియా సీజ్ చేసింది. తమ సముద్ర జలాల నుంచి అక్రమంగా ఆయిల్‌ను తరలిస్తున్న లైట్ హౌజ్ విన్‌మోర్ అనే నౌకను తమ అదుపులోకి తీసుకున్నారు. ఇది ఐక్యరాజ్యసమితి నిబంధనలకు విరుద్ధమైనందునే సీజ్ చేసినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.
ఉత్తర కొరియాకు ఎలాంటి వస్తువును రవాణా చేయకూడదని యూఎన్ సాంక్షన్స్ చెబుతున్నాయని పేర్కొంది. ఉత్తర కొరియాకు రిఫైండ్ ఆయిల్‌ను మొత్తం 11 ప్రధాన నౌకలు రహస్యంగా అందిస్తుంటాయని, అందులో ఇదొకటని, ఇవి కనిపిస్తే వెంటనే సీజ్ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని గతంలోనే అమెరికా ఐక్యరాజ్యసమితిని కోరిందని, ఆ ప్రకారమే తాము నౌకను సీజ్ చేసినట్లు తెలిపారు.