ఆ చూపులే దొరకబడతాయి..

A software company from Japan developed  technology - Sakshi

‘ఆ మొహం ఏంట్రా.. దొంగతనం చేసేవాడిలా అలా పెట్టావూ’అంటూ మనం అప్పుడప్పుడు స్నేహితులను గేలి చేస్తుంటాం. దొంగతనం చేసే వారి ముఖకవళికలు తేడాగా ఉంటాయి కదా మరి.. అచ్చు ఇదే ఐడియాను ఉపయోగించి జపాన్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఓ సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఏదైనా షాపింగ్‌ మాల్‌లో అనుమానంగా తిరుగుతున్న వ్యక్తులను వారి ముఖ కవళికల ఆధారంగా ఈ సాంకేతికత గుర్తిస్తుంది. కృత్రిమ మేధస్సును ఉపయోగించుకుని ఈ సాంకేతికతను తయారుచేశారు. 2002లో టామ్‌క్రూజ్‌ హీరోగా నటించిన మైనారిటీ రిపోర్ట్‌ సినిమాలో ఇలాంటి సాంకేతికతనే వాడారు.

వాకాఐ అనే జపాన్‌కు చెందిన కంపెనీ రూపొందించిన ఈ సాంకేతికత పేరు ‘వాక్‌ఐ’. సీసీ కెమెరాలోని ఫుటేజీ ఆధారంగా వ్యక్తుల ముఖ కవళికలను ఈ సాంకేతికత అధ్యయనం చేస్తుంది. ఒకవేళ ఆ వ్యక్తి అనుమానంగా కనిపించినా.. ఏదైనా దొంగతనం చేస్తాడని భావించినా ఆ టెక్నాలజీ ఫోన్‌లోని సంబంధిత యాప్‌ ద్వారా సమాచారం అందిస్తుంది. వెంటనే అప్రమత్తమై అతగాడిని పట్టేసుకోవచ్చన్న మాట. 2018 డిసెంబర్‌లో యొకహామాలోని షాపింగ్‌మాల్‌లో టోపీ దొంగిలించిన ఓ వ్యక్తిని పట్టించడంతో ఈ టెక్నాలజీ పేరు మారుమోగిపోయింది. వచ్చే మూడేళ్లలో టోక్యోలో లక్ష స్టోర్లలో దీన్ని వినియోగించేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు ‘వాక్‌ఐ’చెబుతోంది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top