జాలరి పట్టే.. పాము తన్నుకుపోయే..! | Snake Comes Out Of Water, Snatches Fisherman's Catch | Sakshi
Sakshi News home page

జాలరి పట్టే.. పాము తన్నుకుపోయే..!

Jul 12 2017 5:36 PM | Updated on Apr 4 2019 3:25 PM

అనగనగా రాజుకు ఏడుగురు కొడుకులు.

అనగనగా రాజుకు ఏడుగురు కొడుకులు. ఏడుగురు వేటకు వెళ్లి ఏడు చేపలు తెచ్చారు. ఆగండి.. ఆగండి.. ఈ కథకు స్టోరికి అసలు సంబంధం లేదు. అయితే, చేపతో మాత్రం సంబంధం ఉంది. సరదాగా చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తికి ఎదురైన వింత అనుభవం మనం చిన్ననాటి నుంచి వింటున్న కథలానే ఉంటుంది. అయితే, ఆ కథ నిజమో కాదో తెలీదు కానీ ఇది మాత్రం నిజమే.

అమెరికాలోని ఐయోవా రాష్ట్రానికి చెందిన బాబ్‌ హోవర్డ్ సరదాగా చేపలు పట్టుకోవడం కోసం తన నివాసానికి చేరువలోని రత్‌బున్‌ సరస్సుకు వెళ్లాడు. చేపల కోసం నీళ్లలోకి గాలం విసిరాడు. అరగంటైంది ఒక్క చేపా గాలానికి తగల్లేదు. ఎదురు చూస్తున్నాడు. మళ్లీ ప్రయత్నం చేశాడు. కొంతసేపు నిరీక్షణ అనంతరం గాలానికి చేప చిక్కింది. ఓ మోస్తారు సైజు ఉన్న చేపను బయటకు తీద్దాం అనుకునేలోపు బాబ్‌కు షాక్‌ తగిలింది.

అప్పటిదాకా ఎక్కడ నక్కిందో తెలియని ఓ పాము.. బాబ్‌ చేపను తన్నుకుపోయింది. ఈ ఘటనను తన ఫోన్‌తో ఫొటోలు తీసి సోషల్‌మీడియాలో షేర్‌ చేశాడు. ఒక్కగానొక్క చేప చిక్కితే అది కూడా ఈ పాము తన్నుకుపోయిందని తెగ బాధపడిపోయాడు. బాబ్‌ పెట్టిన పోస్టు సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement