ప్రమాదవశాత్తు జలపాతంలో పడి..

Six elephants die trying to save each other at Thai waterfall - Sakshi

నాలుగు ఏనుగుల మృతి

థాయ్‌ నేషనల్‌ పార్క్‌లో ఘటన

బ్యాంకాక్‌: ప్రమాదవశాత్తు జలపాతంలో పడి నాలుగు అడవి గున్న ఏనుగులు మృతి చెందిన ఘటన థాయ్‌లాండ్‌లోని ఖావో యై జాతీయ పార్కులో చోటు చేసుకుంది. భారీ వర్షం కారణంగా పార్క్‌లో ఉన్న జలపాతానికి వరద నీరు పెరిగింది. ఈ నీటిలో మొత్తం ఆరు ఏనుగులు చిక్కుకున్నాయి. అందులో నాలుగు ఏనుగులు ప్రవాహంలో కొట్టుకుపోతూ రాళ్లను ఢీకొని మృతి చెందాయి.

మృతి చెందిన ఓ గున్న ఏనుగును చేరుకొనేందుకు మిగిలిన రెండు ఏనుగులు ప్రయత్నించసాగాయి. దీన్ని గుర్తించిన పార్క్‌ అధికారులు లోయలో నుంచి వాటిని రక్షించారు. నీటి ప్రవాహానికి ఎదురు వెళ్లిన గున్న ఏనుగులు తీవ్రంగా అలసిపోయాయని, ప్రస్తుతం అవి విశ్రాంతి తీసుకుంటున్నాయని పార్కు అధికారులు తెలిపారు. మరో వారం పాటు వాటి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తామని తెలిపారు. ఏనుగులను రక్షించే సమయంలో పర్యాటకులను జలపాతం వద్దకు అనుమతించలేదు.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top