సిరియాలో అమెరికా మళ్లీ దాడులు? | Site of chemical attack hit again | Sakshi
Sakshi News home page

సిరియాలో అమెరికా మళ్లీ దాడులు?

Apr 9 2017 1:10 AM | Updated on Sep 5 2017 8:17 AM

సిరియాలో ఐసిస్‌ అధీనంలో ఉన్న రఖా సమీపంలో శనివారం జరిగిన వైమానిక దాడుల్లో కనీసం 15 మంది చనిపోయారు.

15 మంది మృతి
బీరుట్‌: సిరియాలో ఐసిస్‌ అధీనంలో ఉన్న రఖా సమీపంలో శనివారం జరిగిన వైమానిక దాడుల్లో కనీసం 15 మంది చనిపోయారు. అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలే ఈ దాడులకు పాల్పడినట్లు భావిస్తున్నట్లు సిరియా మానవ హక్కుల సంస్థ మానిటర్‌ శనివారం ప్రకటించింది.

హెనేడాలో జరిగిన ఈ దాడుల్లో కనీసం 17 మంది గాయపడ్డారని, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని వెల్లడించింది. రఖాకు 25 కి.మీ దూరంలో ఉన్న హెనేడాను అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాల మద్దతున్న కుర్దిష్‌–అరబ్‌ కూటమి లక్ష్యంగా చేసుకుని గత కొద్ది రోజులుగా దాడులు ముమ్మరం చేస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement