అవామీలీగ్‌ అఖండ విజయం

Sheikh Hasina Win Again in Bangladesh - Sakshi

నాలుగోసారి బంగ్లా ప్రధానిగా షేక్‌ హసీనా

పార్లమెంట్‌ ఎన్నికల్లో ఘనవిజయం

ఢాకా: బంగ్లాదేశ్‌ ప్రధానిగా షేక్‌ హసీనా నాలుగోసారి పగ్గాలు చేపట్టారు. ఆదివారం జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆమె నేతృత్వంలోని అవామీ లీగ్‌ భారీ మెజారిటీ సాధించింది. 299 స్థానాలకు పోలింగ్‌ జరగగా అధికార అవామీలీగ్‌ 288 స్థానాల్లో విజయఢంఖా మోగించింది. ఈ మేరకు బంగ్లా ఎలక్షన్‌ కమిషన్‌ సెక్రటరీ ఉద్దీన్‌ ఆహ్మద్‌ ప్రకటించారు. ప్రతిపక్ష బంగ్లాదేశ్‌ నెషనలిస్ట్‌ పార్టీ ఘోరపరాజయం పాలైంది. గోపాల్‌ గంజ్‌ నియోజకవర్గంలో ప్రధాని హసీనా..బీఎన్‌పీ అభ్యర్థి పై రికార్డు మెజారిటీతో గెలుపొందారు. హసీనాకు 2 లక్షల పైచిలుకు ఓట్లు రాగా, ఆమె సమీప ప్రత్యర్థికి కేవలం 123 ఓట్లే దక్కాయి.

బంగ్లా ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసలో 17 మంది చనిపోయారు. ముఖ్యంగా అవామీ లీగ్, బీఎన్‌పీ కార్యకర్తల మధ్య పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి.  బంగ్లాదేశ్‌ ఎన్నికల్లో తిరుగులేని విజయంసాధించిన హసీనాకు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. నాలుగోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తున్న ఆమెకు పలుదేశాల అధినేతలు అభినందనలు తెలుపుతున్నారు.

Spoke to Sheikh Hasina Ji and congratulated her on the resounding victory in the Bangladesh elections.

Wished her the very best for the tenure ahead.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top