షార్జాలో మరో అద్భుత నిర్మాణం

Sharjah to build Waterfront Project named Sun Island - Sakshi

షార్జా : అరుదైన నిర్మాణాలకు ఖ్యాతిగాంచిన యూఏఈ మరో భారీ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. దుబాయ్‌ తీరంలో ‘పామ్‌ ఐలాండ్‌’ పేరుతో నిర్మించిన దీవి.. ప్రపంచ పర్యాటకులను ఎంతగా ఆకర్షిస్తున్నదో తెలిసిందే. దాదాపు అదే తరహాలో ‘సన్‌ ఐలాండ్’  పేరుతో సముద్ర భాగంలో చిన్నచిన్న ఎనిమిది ద్వీపాలను కలుపుతూ ఏకంగా నగరాన్నే నిర్మించ తలపెట్టింది. మొదటి విడతలో ఖరీదైన 231 విల్లాలతో నిర్మిస్తున్న ఈ వాటర్ ఫ్రంట్ సిటీకి సన్ ఐలాండ్ గా నామకరణం చేసింది. తాజాగా ఈ సన్‌ ఐలాండ్‌ నమునా చిత్రాన్ని విడుదల చేశారు దీని డెవలపర్లు. మొదటి దశలో ఖరీదైన 231 విల్లాలో కొన్ని మూడు, నాలుగు బెడ్‌రూంలతో, మరికొన్ని ఐదు, ఆరు బెడ్‌రూంలతో నిర్మించనున్నారు.

2019 చివరి నాటికి ఈ వాటర్‌ ఫ్రంట్‌ సిటీ నిర్మాణం ప్రారంభం కానుంది. ఇప్పటికే కెంపిన్స్కీ, డ్యూసిట్ కంపెనీలు ఈ ప్రాజెక్టులో ఆపరేటర్లుగా చేసేందుకు సంతకాలు చేశాయి. విల్లాల్లో వాణిజ్య యూనిట్లు, షాపింగ్ మాల్స్, వాటర్ పార్కు, హోటళ్ళు నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టును నిర్మించే ప్రదేశం హమ్రియయా జోన్‌ కిందికి వస్తుంది. 8 నుంచి 10 సంవత్సరాల కాలంలో ఈ ప్రాజెక్టు పూర్తి అవుతుందట. ఈ వాటర్‌ ఫ్రంట్‌ సిటీ ద్వారా ప్రక్కనే ఉన్న దుబాయ్‌, అబుదాబి వంటి ఎమిరేట్స్‌ వాసులకు వినోదం, విశ్రాంతికి ఎంతగానో ఉపయోగపడుతుందని, ఈ ఎమిరేట్స్‌ను ఆకర్షించే నీటి టాక్సీలను అందించే దుబాయ్‌ ఆర్టీఏతో డెవలపర్లు ఇప్పటికే చర్చలు జరుపుతున్నారని తెలిసింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top