జాంబియాలో ఘోర రోడ్డు ప్రమాదం | Seven killed in Zambia bus accident | Sakshi
Sakshi News home page

జాంబియాలో ఘోర రోడ్డు ప్రమాదం

Apr 5 2016 8:46 AM | Updated on Sep 3 2017 9:16 PM

ప్రమాద స్థలి వద్ద చెల్లాచెదురుగా పడిఉన్న మృతదేహాలు

ప్రమాద స్థలి వద్ద చెల్లాచెదురుగా పడిఉన్న మృతదేహాలు

జాంబియా రాజధాని లుసాకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు.

లుసాక: డ్రైవర్ నిర్లక్ష్యానికి ఏడు నిండు ప్రాణాలు బలైన సంఘటన జాంబియాలోని లుసాకలో సోమవారం చోటుచేసుకుంది. రాజధాని పట్టణం లుసాక నుంచి 65 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఓ ప్రైవేటు బస్సు కపిరి ప్రాంతంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మహిళలు సహా ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.

మరో 51 మందికి కూడా స్వల్పంగా గాయాలయ్యాయి. సమాచాన్ని అందుకున్న పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే బస్సు బోల్తాకొట్టిందని ప్రయాణికుల ఆరోపిస్తున్నారు. ప్రమాదకరంగా బస్సును నడిపి ఏడుగురి మరణానికి కారణమైన డ్రైవర్ను పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement