ఐదు దశాబ్దాల తర్వాత చోరీ.. | Scottish island records first crime in decades! | Sakshi
Sakshi News home page

ఐదు దశాబ్దాల తర్వాత చోరీ..

Jun 18 2015 6:41 PM | Updated on Aug 30 2018 5:27 PM

ఐదు దశాబ్దాల తర్వాత చోరీ.. - Sakshi

ఐదు దశాబ్దాల తర్వాత చోరీ..

యూకేలోని స్కాటీష్ తీరంలోని ఓ ద్వీపంలో చోరీ జరిగింది. మన దగ్గర ఇటువంటివి చాలా జరుగుతాయి కదా!

లండన్: యూకేలోని  స్కాటీష్ తీరంలోని ఓ ద్వీపంలో చోరీ జరిగింది. మన దగ్గర ఇటువంటివి చాలా జరుగుతాయి కదా! ఇందులో విశేషం ఏముందంటారా? సుమారు ఐదు దశాబ్దాల తర్వాత తొలిసారిగా జరిగిన చోరీ ఇది. ఇక్కడ చివరిసారిగా ద్వీపంలోని చర్చిలో 1960లో చెక్కతో తయారు చేసిన ఓ ప్లేట్ అపహరించారు. అయితే, ఇప్పటికీ ఈ కేసు పరిష్కారం కాకపోవడం, నిందితుడిని గుర్తించకపోవటం ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది. వాస్తవానికి స్కాట్లాండ్ తీరాన గల హిబ్రిడీయన్ ద్వీపం జనాభా వంద కూడా ఉండరు. అయితే అక్కడ ఎటువంటి నేరాలు జరిగనందున పోలీస్ స్టేషన్ గానీ, కనీసం ఓ కానిస్టేబుల్ కూడా ఉండకపోవడలం గమనార్హం. అయితే గుర్తుతెలియని దొంగలు ఓ స్టోర్ లో చొరబడి చాక్లెట్లు, స్వీట్లు, బిస్కట్లు, బ్యాటరీలు దొంగిలించారు.

కస్టమర్ల సౌకార్యార్థం ఆ షాపు 24 గంటలు తెరిచే ఉంటుంది. కస్టమర్లు తమకు నచ్చిన వస్తువులు, ఆహారం తీసుకుని 'నిజాయతీ పెట్టె'లో నగదును  వేసి వెళ్లేవారు. అయితే తాజా సంఘటనలో కస్టమర్లు డబ్బులు చెల్లించకుండా, కొన్ని వస్తువులు దోచుకెళ్లారని నిర్వాహకురాలు గుర్తించారు. ఈ పరిణామంతో ఆశ్చర్యానికి లోనయినట్లు అక్కడి కౌన్సిలర్ బిల్ క్లర్క్ తెలిపింది. చోరీ ఘటన నిజాయతీకి మారుపేరుగా ఉన్న వాళ్లు సీసీటీవీ కెమెరా పెట్టాలని ఆలోచిస్తున్నారు. డబ్బులు మాత్రం పోలేదని, 200 పౌండ్ల విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయని ఆ స్టోర్ నిర్వాహకురాలు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement