breaking news
honesty box
-
ఇదో నిజాయితీ పెట్టె కథ!
పిల్లలకు మనం చిన్నప్పుడు ఏది మంచిదని చెబితే దాన్నే పాటిస్తారు. విలువలు నేర్పితే మంచి పౌరులుగా ఎదగి సమ సమాజ స్థాపనకు కృషి చేస్తారు. అందుకే మొక్కై వంగనిది మానై వంగునా అని పెద్ద సామెత చెబుతూ వుంటారు. ఈ క్రమంలోనే పిల్లల్లో నిజాయితీని పెంపొందించేందుకు ఒక ఉపాధ్యాయుడు చేసిన చిన్న ప్రయత్నం మంచి ఫలితాలను ఇస్తోంది. పాఠశాలలో ఏర్పాటుచేసిన నిజాయితీ పెట్టె ద్వారా పిల్లలు నిజాయితీగా, నైతిక విలువలతో మసలుకుంటున్నారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. పలమనేరు: చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం కీలపట్ల బడిలో ఓ నిజాయితీ పెట్టె ఉంది. ఇందులో పిల్లలకు అవసరమైన పెన్నులు, పెన్సిళ్లు, రబ్బర్లు, రేజర్లు, చాక్లెట్లు, నోట్‌బుక్స్ ఉంటాయి. అవరసమైన పిల్లలు తమకు కావాల్సిన వస్తువులను తీసుకుని దానిపై నిర్ణయించిన ధర చెల్లించాలి. నిజాయితీతోపాటు లెక్కలు వస్తాయి ఈ పెట్టె కారణంగా చిన్నప్పటి నుంచే పిల్లలు విలువలతో పాటు లెక్కలు నేర్చుకునేందుకు వీలు ఏర్పడింది. బడిలో చోరీ చేయాల్సిన పని లేకుండా పోయింది. వారు కొనుక్కున్న వస్తువులకు ఎంత డబ్బు చెల్లించాలి, ఇచ్చిన డబ్బులో ఎంత మిగిలింది అనే విషయం వారు అనుభవంతో తెలుసుకుంటారు. తద్వారా నిజ జీవితంలోనూ అవసరమై లెక్కలు నేర్చుకుంటున్నారు. పెట్టెలోని వస్తువులను డబ్బు లేకున్నా పొంది ఆపై ఉన్నప్పుడు డబ్బు కట్టవచ్చు. దీంతో లావాదేవీలు నీతిగా ఉండాలనే తలంపు చిన్నప్పటి నుంచే పిల్లలకు అలవడుతోంది.టీచర్ విన్నూత్న ఆలోచనతో సాకారం ఇదే బడికి చెందిన తులసీనాథం నాయుడు అనే టీచర్ రూ.2 వేలు పెట్టి పిల్లలకు అవరసమైన వస్తువులను ఈ పెట్టెలో పెట్టారు. ఆపై ఇందులోని అవసరమైన వస్తువులను పిల్లలు కొనడం మొదలు పెట్టారు. ఇలా నెలంతా వసూలైన మొత్తంతో ఆ టీచర్ మళ్లీ వస్తువులను బాక్సులో నింపడం చేస్తున్నారు.పరాయి సొమ్ము పామువంటిదని తెలిసింది మా స్కూల్లో నిజాయితీ పెట్టె ఉంది. మాకు అవరసమైన వస్తువులను తీసుకుని నిర్ణయించిన ధర మేరకు డబ్బును సార్‌కు ఇస్తున్నాం. దీంతో బడిలో ఎలాంటి చోరీలు లేకుండాపోయాయి. మాకు లెక్కలు బాగా అర్థమవుతున్నాయి. పరుల సొమ్ము పాము వంటిందని బాగా తెలిసింది. డబ్బులు లేకున్నా కావాల్సిన వస్తువులను పెట్టెలో తీసుకుని ఆపై డబ్బును ఇవ్వడం కూడా నిజాయితీనే కదా అనే విషయం అర్థమైంది. – భానుప్రియ, నాలుగో తరగతి విద్యార్థినిమొక్కై వంగనిది మానై వంగునా.. చిన్నప్పటి నుంచి పిల్లలకు మానవ విలువలు, నీతి, నిజాయితీ గురించి చెబితే పెద్దయ్యాక కూడా అలాగే నడుస్తారు. నేను తొలుత ఇదే మండలంలోని కంచిరెడ్డిపల్లి బడిలో నిజాయితీ పెట్టెను ఏర్పాటుచేశాను. పిల్లల్లో చాలా మార్పు వచ్చింది. దీంతో నేను ఏ బడికి వెళ్లినా అక్కడ నిజాయితీ పెట్టెను పెడుతున్నా. తద్వారా పిల్లల్లో నిజాయితీ, మంచితనం అలవాటుగా మారింది. పెద్దలు చెప్పినట్టు మొక్కై వంగనిది మానై వంగుతుందా.. – తులసీనాథం నాయుడు, టీచర్ -
ఐదు దశాబ్దాల తర్వాత చోరీ..
లండన్: యూకేలోని స్కాటీష్ తీరంలోని ఓ ద్వీపంలో చోరీ జరిగింది. మన దగ్గర ఇటువంటివి చాలా జరుగుతాయి కదా! ఇందులో విశేషం ఏముందంటారా? సుమారు ఐదు దశాబ్దాల తర్వాత తొలిసారిగా జరిగిన చోరీ ఇది. ఇక్కడ చివరిసారిగా ద్వీపంలోని చర్చిలో 1960లో చెక్కతో తయారు చేసిన ఓ ప్లేట్ అపహరించారు. అయితే, ఇప్పటికీ ఈ కేసు పరిష్కారం కాకపోవడం, నిందితుడిని గుర్తించకపోవటం ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది. వాస్తవానికి స్కాట్లాండ్ తీరాన గల హిబ్రిడీయన్ ద్వీపం జనాభా వంద కూడా ఉండరు. అయితే అక్కడ ఎటువంటి నేరాలు జరిగనందున పోలీస్ స్టేషన్ గానీ, కనీసం ఓ కానిస్టేబుల్ కూడా ఉండకపోవడలం గమనార్హం. అయితే గుర్తుతెలియని దొంగలు ఓ స్టోర్ లో చొరబడి చాక్లెట్లు, స్వీట్లు, బిస్కట్లు, బ్యాటరీలు దొంగిలించారు. కస్టమర్ల సౌకార్యార్థం ఆ షాపు 24 గంటలు తెరిచే ఉంటుంది. కస్టమర్లు తమకు నచ్చిన వస్తువులు, ఆహారం తీసుకుని 'నిజాయతీ పెట్టె'లో నగదును వేసి వెళ్లేవారు. అయితే తాజా సంఘటనలో కస్టమర్లు డబ్బులు చెల్లించకుండా, కొన్ని వస్తువులు దోచుకెళ్లారని నిర్వాహకురాలు గుర్తించారు. ఈ పరిణామంతో ఆశ్చర్యానికి లోనయినట్లు అక్కడి కౌన్సిలర్ బిల్ క్లర్క్ తెలిపింది. చోరీ ఘటన నిజాయతీకి మారుపేరుగా ఉన్న వాళ్లు సీసీటీవీ కెమెరా పెట్టాలని ఆలోచిస్తున్నారు. డబ్బులు మాత్రం పోలేదని, 200 పౌండ్ల విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయని ఆ స్టోర్ నిర్వాహకురాలు వివరించారు.