
లాహోర్: పదవీచ్యుతుడైన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇంటిపైకి గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. లాహోర్ మోడల్‌టౌన్ ప్రాంతంలో ఉన్న సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఇజాజ్ ఉల్ అహ్‌సాన్ నివాసంపై గుర్తు తెలియని దుండగులు తెల్లవారు జామున 4.30 గంటలకు, తిరిగి ఉదయం 9 గంటల సమయంలో రెండుసార్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. పనామా పత్రాల కేసులో నిందితుడిగా ఉన్న ప్రధానమంత్రి నవాజ్‌షరీఫ్‌పై అనర్హత వేటు వేసిన సుప్రీంకోర్టు బెంచ్‌లో జస్టిస్ అహ్‌సాన్ కూడా ఒకరు.