'కావాలంటే నన్ను చంపండి' | Satyarthi offers himself to the terrorists if they were ready to free the children | Sakshi
Sakshi News home page

'కావాలంటే నన్ను చంపండి'

Dec 16 2014 7:24 PM | Updated on Sep 2 2017 6:16 PM

'కావాలంటే నన్ను చంపండి'

'కావాలంటే నన్ను చంపండి'

పాకిస్థాన్లోని పెషావర్ ఆర్మీ స్కూల్పై ఉగ్రవాద దాడి ఘటనను నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలు కైలాస్ సత్యార్థి, యూసఫ్ జాయ్ మలాలా ఖండించారు.

న్యూఢిల్లీ: పాకిస్థాన్లోని పెషావర్ ఆర్మీ స్కూల్పై ఉగ్రవాద దాడి ఘటనను నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలు కైలాస్ సత్యార్థి, యూసఫ్ జాయ్ మలాలా ఖండించారు. ఉగ్రవాదులు కావాలంటే తనను చంపి, పిల్లల్ని విడుదల చేయాలని కైలాస్ అన్నారు. ఇదో చీకటి దినమని కైలాస్ సత్యార్థి అభివర్ణించారు.

ఉగ్రవాద దాడి పిరికిపందల చర్యని మలాలా ఖండించారు. చిన్నారులను చంపడం హేయమని అన్నారు. బాలల హక్కుల కోసం పోరాడిన కైలాస్, మలాలా ఇటీవల సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి స్వీకరించిన సంగతి తెలిసిందే. పెషావర్ ఆర్మీ స్కూల్లో ఉగ్రవాదుల దాడిలో విద్యార్థులతో సహా దాదాపు 126 మంది మరణించారు. ఉగ్రవాద దాడులు జరుగుతున్న సమయంలో కైలాస్, మలాలా స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement