అక్క‌డ నేనే మ‌హారాణి: హీరోయిన్‌ | Sara Ali Khan Says She Queen Of Her Own Dreams Shares Throwback Pic | Sakshi
Sakshi News home page

రాజసం ఉట్టిప‌డుతోన్న హీరోయిన్‌ చిన్న‌నాటి ఫొటో

Apr 28 2020 8:19 AM | Updated on Apr 28 2020 8:28 AM

Sara Ali Khan Says She Queen Of Her Own Dreams Shares Throwback Pic - Sakshi

త‌క్కువ కాలంలోనే త‌గినంత పాపులారిటీ తెచ్చుకుందీ బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్. రెండేళ్ల కింద‌ట ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన సారా సినిమాల ఎంపిక‌లో ఆచితూచి అడుగులు వేయ‌డ‌మే కాక‌ స్టార్ హీరోల స‌ర‌స‌న జట్టు క‌డుతూ అందాల ఆర‌బోత‌కూ సై అంటోంది. ఎప్పుడూ హాట్ హాట్ ఫొటోల‌ను షేర్ చేసే ఈ ముద్దుగుమ్మ తాజాగా చిన్ననాటి ఫొటోను సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. కుంద‌న‌పు బొమ్మ‌లా త‌యారై ఉన్న ఈ ఫొటోలో సారా చూడ‌చ‌క్క‌గా ఉందంటూ అభిమానులు పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు. ఇక రాజ‌సం ఉట్టిప‌డుతున్న ఈ ఫొటో గురించి సారా త‌న‌ను తానే రాణిగా అభివ‌ర్ణించుకుంటోంది. (లాక్‌డౌన్‌ నాకు కొత్త కాదు!)

"నా క‌ల‌ల్లో ఎప్ప‌టికీ నేనే మ‌హారాణిని" అంటూ స‌ద‌రు ఫొటోకు క్యాప్ష‌న్ జోడించింది. ఈ ఫొటోకు ఫిదా అయిన అభిమానులు కూడా ఆమె మాట‌ను ఏకీభ‌వించ‌కుండా ఉండ‌లేక‌పతున్నారు. నిజంగానే మీరు ఎంతో అందంగా, తేజస్సుతో వెలిగిపోతున్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్ర‌స్తుతం సారా ముంబైలో త‌న త‌ల్లి అమృతా సింగ్‌, సోద‌రుడు ఇబ్ర‌హీం అలీ ఖాన్‌తో క‌లిసి క్వారంటైన్ స‌మయాన్ని క్వాలిటీ టైమ్‌గా మార్చుకుంటోంది. ఇప్పుడు సినిమాలు లేవు క‌దా అని బ‌ద్ధ‌కించ‌కుండా వ‌ర్క‌వుట్‌లు చేస్తూ ఆరోగ్యంపై శ్ర‌ద్ధ‌పెడుతూ లాక్‌డౌన్ స‌మ‌యాన్ని స‌ద్వినియోగం చేసుకుంటోంది. (‘అన్నయ్యా.. వదిన వచ్చింది చూడు..!’)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement