రష్యా స్పేస్‌ సంస్థ టాప్‌ అధికారి హత్య? | Russian space top official found dead in prison cell | Sakshi
Sakshi News home page

రష్యా స్పేస్‌ సంస్థ టాప్‌ అధికారి హత్య?

Mar 19 2017 7:03 PM | Updated on Sep 5 2017 6:31 AM

రష్యా స్పేస్‌ సంస్థ టాప్‌ అధికారి హత్య?

రష్యా స్పేస్‌ సంస్థ టాప్‌ అధికారి హత్య?

రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థకు సంబంధించిన ఓ ఉన్నత శ్రేణి అధికారి చనిపోయాడు. అవినీతి, సంస్థకు ద్రోహం చేసిన కేసులో ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్న ఆయన తన సెల్‌లో కత్తిపోట్లతో విగతజీవిగా కనిపించారు.

మాస్కో: రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థకు సంబంధించిన ఓ ఉన్నత శ్రేణి అధికారి చనిపోయాడు. అవినీతి, సంస్థకు ద్రోహం చేసిన కేసులో ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్న ఆయన తన సెల్‌లో కత్తిపోట్లతో విగతజీవిగా కనిపించారు. వ్లాదిమిర్‌ ఎవ్‌డోకిమోవ్‌ అనే వ్యక్తి రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన్ను లంచాలు తీసుకున్న ఆరోపణలకింద అరెస్టు చేసిన పోలీసులు ప్రస్తుతం జైలులో వేశారు.

వ్లాదిమిర్‌ ఉంటున్న జైలు గదిలోనే మరో 11మంది ఉంటున్నారు. ప్రస్తుతం వారిని విచారిస్తున్నారు. వ్లాదిమర్‌ శరీరంపై కత్తిపోట్లు ఉన్నాయని, అయితే, అవి వేరే ఎవరైనా చేశారా, లేక అతడే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారా అనే విషయం ఇంకా నిర్ధారించలేదని రష్యా దర్యాప్తు కమిటీ అధికారిక ప్రతినిధి యులియా ఇవానోవా చెప్పారు. రష్యా అంతరిక్ష వ్యోమనౌక, రీసెర్చ్‌ ఎజెన్సీలో క్వాలిటీ కంట్రోల్‌ విభాగంలో వ్లాదిమర్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement