'ఐఎస్కు అంత సీన్ లేదు' | Russian military denies IS destroyed its helicopters | Sakshi
Sakshi News home page

'ఐఎస్కు అంత సీన్ లేదు'

May 25 2016 8:36 AM | Updated on Sep 4 2017 12:55 AM

'ఐఎస్కు అంత సీన్ లేదు'

'ఐఎస్కు అంత సీన్ లేదు'

ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్కు అంత సీన్ లేదని రష్యా పేర్కొంది. తమ దేశానికి చెందిన ఏ హెలికాప్టర్ను, ట్రక్కును ధ్వంసం చేయలేదని స్పష్టం చేసింది.

మాస్కో: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్కు అంత సీన్ లేదని రష్యా పేర్కొంది. తమ దేశానికి చెందిన ఏ హెలికాప్టర్ను, ట్రక్కును ధ్వంసం చేయలేదని స్పష్టం చేసింది. సిరియాలోని ఓ బేస్ పాయింట్లో పదుల సంఖ్యలో ఉన్న రష్యా హెలికాప్టర్లను, ట్రక్కులను ఇస్లామిక్ స్టేట్ ధ్వంసం చేసిందని పేర్కొంటూ కొన్ని షాటిలైట్ చిత్రాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో అదేం లేదని రష్యా స్పష్టం చేసింది. 'మా దేశానికి చెందిన అన్ని యుద్ధ హెలికాప్టర్లు, ట్రక్కులు భద్రంగా ఉన్నాయి. సిరియాలోని హోమ్స్ ప్రావిన్స్లో ప్రతి రోజులాగే ఇప్పటికీ ఉగ్రవాదసంస్థల స్థావరాలను ధ్వంసం చేసే పనుల్లో నిమగ్నమై ఉన్నాయి. మా దేశానికి చెందిన ఒక్క సైనికుడికి ఏం జరగలేదు. నష్టానికి సంబంధించిన జాడే లేదు' అని రష్యా డిఫెన్స్ అధికార ప్రతినిధి ఇగోర్ కోనాషెంకోవ్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement